పుట:Vijaya-Nagara-Samrajyamu.pdf/119

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పదమూఁడవ ప్రకరణము

101


రాయ, వేంకటాద్రి ప్రభృతులు ప్రాణములతో నున్నంత కాలము శత్రుబలములకు జయసిద్ధి దుర్లభము. వారికి దగిన యెత్తులను దఱువాతఁ జూచుకొందము.

చక :- ఈగండము 'గడచినపిదప విచారింపవచ్చును. కాని గోల్కొండనార్త లేమి ? తారానాధులుగారు !

తారా.. ఏమున్నవి ? అతఁడు దినదినము నూతన సైన్యములను జేర్చుచున్నాఁడు.దుర్గములను బాగు చేయించుచున్నాఁడు. కాని యతనికి రామరాజు సైన్యములను మార్గమధ్యము ననే యడ్డగింపవలయునని యున్నది.

చక్ర:- తదితర మహమ్మదీయ ప్రభువులు కూడ దీనికంగీక రించినారా?

ఆదిల్ :-ప్రొద్దుపోయినది. ఇంకనుండుట యంత క్షేమముకాదు. పోవుదము.

అంతలో,ఆ చెట్టున మరల కొంచెము సందడి యయ్యెను. ఆ మువ్వురును, ఆవంక పరీక్షించి చూచిరి. ఏమి యును గన్పడ లేదు. దీప మటు గొంపోయి యా త్రయము మిక్కిలి శ్రద్ధగాఁ బరికించిరి. కాని యేమియు గోచరముకా లేదు. భయము దొంగలకు సహజము. ఏచప్పుడు విన్నను వారిగుండె లవియును. దొరలకు భయపడవలసిన యవసరము లేదు. కాని యిదేమైయుండును ? వట్టిచప్పుడా ! లేకందు మానవు? డెవఁడేని దాగియుండెనా ! తుట్టతుదకు వా రది