పుట:Vijaya-Nagara-Samrajyamu.pdf/111

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప ద మూఁడ వ ప క ర ణ ము

దుష్ట గ్రహ కూటము


విజయ నగరములోఁ బూర్వపరిచితిగల యొక భవన మునకు మరల మనమరిగి యచటి నృత్తాంతములను దెలిసి కొందము.

అది యాదిల్శాహా యొక్క రహస్యమందిరము. అం దితరుల కెవరికిని బ్రవేశము లేదు. మనకధకు సంబంధించిన త్రిమూర్తులకు మాత్ర మందు సర్వ కాలములఁ బ్రవేశింప నర్హత కలదు. తదితరులు ప్రవేశింపవలయు నన్నచో, ఆదిల్శాహా గారి యనుమతి కావలయును. దానికి నుత్తరమున దూర ముగా, ఆదిల్శాహా భోజనశాల మొదలగు దిన్యమందిరములు కలవు.

ఇపు డా రహస్యమందిరమున నొక్క తారానాధుఁడు మాత్రము కూర్చుండియుండెను. అందు సన్నని దీపము వెల్లు చుండెను. బహి. ప్రపంచ మెల్ల సంధకారావృతమై యుండెను. అది వారికి సంకేతస్థలము. చక్రధరుఁడును ఆదిల్శాహాయు తారా నాధుఁడును అచట నారాత్రి కలసికొన వలయునని వారు నిర్దేశించు కొనిరి. ఇప్పటి కొక్క తారానాధుఁడు మాత్రమే