పుట:Vijaya-Nagara-Samrajyamu.pdf/112

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

94

విజయనగర సామ్రాజ్యము


వచ్చెను. ఒంటరిగాఁ గూర్చుండుట కతని కిష్టము లేకుండెను. ఒకటి రెండు సార్లు వారువచ్చుచున్నా రేమో యని యా సౌ ధపుఁ బురో భాగమునకు వచ్చి చూచెను. కాని యెవరును వచ్చుచున్నట్లు కనఁబడ లేదు సరిగదా వచ్చుచున్న జాడ దూర మునఁగూడఁ దోచినది కాదు. అతఁడు మరలవచ్చి యాకుర్చీ పై గూర్చుండి యిట్లు యోజింపఁ దొడఁగెను.

" రాజనీతి మిక్కిలి విచిత్రమైనది. రాజులు బిడ్డలను నమ్మరు. మిత్రులను నమ్మరు. స్వబంధువులను నమ్మరు. కాత్మలాభ పరాయణత్వముతప్ప మఱి విచారణ యుండదు. గోల్కొండ నవాబు రామరాజు పై జేయుచున్న కుట్రలలో నిపుణతతోను బట్ట దలతోను బ్రవ ర్తించుచున్న యీ యాదిల్శాహాను సహితము నమ్మక మరల నాకు నుత్త రము వ్రాసినాఁడు.

అతని కుడిహస్తము పొడవుగా వేలాడుచున్న యతని చొక్కాయి జేబులోఁ బ్రవేశించెను. అది యొక యుత్తరమును బయికిఁదీసెను. అతడా లేఖను దీపము వెలుఁగున నిట్లు చదివెను.

అయ్యా ! మీరు మొన్న వ్రాయించిన యుత్తరమును జూచితిని. సయత్యద్భుత "మేధాశక్తులకు సంతసించుటకంటె నే నేమియుఁ జేయఁజూలను. బుద్ధి సాగరునకు రామరాజునకును భేదముకల్పించుట మన కెంతయు లాభదాయకము. అతఁడిపుడు