పుట:Vijaya-Nagara-Samrajyamu.pdf/110

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

92

విజయనగర సామ్రాజ్యము


యోజించుకొనుము. నాకుఁ దొందరపని యున్నది. నేను పోవ లేను.' అని ఆపె వంక వీక్షించుచుఁ జనియెను. జగన్మోహినికి శోకము హెచ్చెను. శిశి ఋతువునఁ బ్రాతః కాలమున నల్లకల్వల రేకులనుండి జారునట్లా మె కనులనుండి బాష్పములు జారుచుం డెను. ఆమె వెక్కి వెక్కి యేడ్చుచుండెను. మధ్యమధ్య తలి దండ్రులను తలఁచు కొనుచుండెను. లోన నుండి పొరలివచ్చుదు: ఖము నాపు కొనుచు స్వర్ణ కుమారి యాపె నోదార్చుచుండెను.