పుట:Vijaya-Nagara-Samrajyamu.pdf/109

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పం డ్రెండవ ప్రకరణము

91


స్వర్ణ : వారిదగ్గఱ గొలువున్న వీర సింహమును విజయసింహు నెఱుఁగుదురా ! అతని పరాక్రమమును వింటిరా ?

నవాబు: ఆఁ ! వింటిని. అయిన నేమి ?

స్వర్ణ : అతని నీమె సరించినది. ఆ సింహమున కీవార్త దెలిసిన లేడిని సింహము కబళించునట్టులు మిమ్ముఁ గబళించి మీ రాజ్యమును విధ్వంసము చేయకుండునా ?

నవాబు: అతని పరాక్రమమును మా పరాక్రమమును కొలఁది కాలముననే జఱుగనున్న యుద్ధమున మీరే చూడఁగలరు. ఉత్తమాటలతోడఁ బ్రయోజన మేమి ?

స్వర్ల:- విజయనగర చక్రవర్తుల భుజపరాక్రమమును దురుష్క రాజులు చక్కగాఁ జవిచూచినారు. రుచి వారికే యెఱుక . వా రే దానిని వర్ణింపవలెను.

అతని కింతలో నేది యో స్మృతికి వచ్చెను. అతఁడంత

  • జగన్మోహినీ! ఇంకఁ దయదలఁపను. అయినను నీ యందు

గల కరుణ విశేషమునఁ జేసి యొకమాసము గడువు నిచ్చితిని- అబ్బా ! మాసము వఱకుఁ దాళఁగలనా ! అయినను మాట యంటిని. త్రిప్పుకొన జాలను. అప్పటికిఁ గూడ నిట్లే గట్టిపట్టు పట్టితి వేని నీకు నీప్రాణము దక్కదు. ఇంతేగాక నీ తలి దండ్రులుకూడ భూలోక యాత్రను విడిచి పెట్టవలసిన వారగు దురు. ఈ కేది యుక్తమో లెస్సగా నీ గడువు కాలమున