పుట:Venoba-Bhudanavudyamamu.pdf/6

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

5


తండ్రిగా స్వీకరించినందులకు, ఆస్థానాన్ని స్థిరపరచుకొనుటకు ప్రయత్నించెదను. నేను హిరణ్యకశిపు డయిన, నీవు ప్రహ్లాదుడివి కావలెను.

మరొక సమయంలో గాంధీజీ వినోబాజీని గురించి యిలా అన్నారు. "వినోబా గొప్ప వ్యక్తి. దాక్షిణాతుల్యలతోను, మహరాష్ట్రులతోను నాకుగల సంబంధం చాల వుత్కృష్టమైనది. వినోబా అందరిని మించిన వ్యక్తి."

వినోబాజీ అశ్రమమునకు తిరిగివచ్చిన కొద్దికాలంలోనే వారి తల్లి జుబ్బుపడెను. బాబూజీ ఆజ్ఞప్రకారము, వినోబాజీ మాతృసేవకై వెళ్లెను. తల్లి దండ్రులు, సోదరుడుకూడ జబ్బుపడివుండిరి, తమ్ముడు మరణించిన మూడుదినములకు 1918 సం||లో తల్లికూడ స్వర్గస్థురాలయ్యెను. కర్మ కాండలలో తనకు విశ్వాసము లేక పోవుటచే, తల్లి అంత్యక్రియలలో పాల్గొనక, తనమాతృదేవి గదిలో కూర్చొని, గీతా, ఉపనిషత్తులు పఠించిరి.

తమ తల్లి జ్ఞాపక చిహ్నముగా ఆమెచీర, ఆమె పూజించు అన్నపూర్ణ విగ్రహాన్ని తీసుకొని, తిరిగి ఆశ్రమంచేరిరి. చీరెను తనతల క్రింద నుంచుకొని, నిదురపోయేవారు. ఖాదీ ప్రారంభముతో అచీరెను సబర్మతీ నదీప్రవాహమునకు సమర్పించిరి. అన్నపూర్ణ విగ్రహమును కాశిబెన్‌కు (కృష్ణదాస్ గాంధీ భార్య) బహూకరించిరి.

వినోబాజీ తమడైరీలో, తమ తల్లి మృతి చెందినప్పటికి, ఆమాతృ హృదయ స్పందనము ఎప్పటికి లోలోన అనుభవించుచున్నానని, అది అమరత్వానికి తార్కాణం అని వ్రాసుకొనిరి.

1921 సం||లో గాంధీజీ అనుమతితో శ్రీ జమ్నాలాల్ బజాజ్ వినోబాను వార్గాకు తీసుకొని వచ్చిరి. విద్యార్థి దశలో నున్న వారి శిష్యులు, శ్రీవల్లభస్వామి (ప్రస్తుతం సర్వసేవా సంఘ సహాయ కార్యదర్శి) సబర్మతికి వచ్చిన, వారి సహాధ్యాయులు, థోత్రేజీ, 'మోఘేజీ, గోపాలరావుకా లే దస్తాన్ కుందర్ దివాన్ , వలంజ్ కర్ భీ, ప్రభాకరజీ, సత్యాన్ మొదలగువారుకూడ వార్ధాకు వచ్చిరి.

1921 సం|| ఏప్రిల్ 8 తేదీన వినోబా వార్ధాచేరి, అందరిని చక్కటి శిక్షణలో నుంచి, మంచిపనిచేయించిరి. విధివిరామం లేకుండా, నిరంతరం పనిచేస్తూవుండేవారు. బక్క దేహంలో, దట్టమైన గడ్డముతో, వింతగా అగుపడుచుండెడివారు. 1921 సం!! నుంచి 1947 సం|| వరకు