పుట:Venoba-Bhudanavudyamamu.pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

6


వినోబాజీ ఆత్మ పరిశోధనాలయములో తీవ్రమైన ఆత్మ ప్రయోగములు, ఆశ్రమములో గ్రామ పరిశ్రమల పరిశోధన జరుగుచుండెడివి. వీని పరిణామముగా, వారి ఆత్మ పరిశోధనలు అత్యున్నతమైన ఆధ్యాత్మిక శిఖరములు చేరెను. గ్రామ పరిశ్రమల పరిశోధనా పరిణామంగా గాంధీజీ సూచించిన అష్టాదశసూత్ర నిర్మాణ కార్యక్రమములతో, నవచైతన్యముతో ఆశ్రమమంతా తొణికిసలాడుచుండెను. 1932 సం॥లో వర్ధాకు రెండు మైళ్లు దూరములోనున్న “సల్వాడ్" గ్రామంచేరిరి. తమ జీవితం కేవలఁ నూలు వడకుటయందే ఆధారపరచి, ఖద్దరు పరిశ్రమలో గంభీర చింతనచేసిరి అనారోగ్య కారణంగా, పర్వత ప్రాంతములకు వెళ్లుట మంచిదని తెలుపబడెను. వార్ధాకు 5 మైళ్లదూరములో, "పొనారు" నదీ వద్దననున్న, ఏకాంత పర్వత ప్రాంతమునకెళ్ల, తమ అభిప్రాయమును తెలియజేసి. వినోబాజీ గాంధీగారి అనుమతితో అచ్చటకు వెళ్లిరి. దానికి “పరంధామ ఆశ్రమం," అని పేరిడిరి. అప్పటినుంచి యిదే వారి ప్రధాన కార్యాలయ మయ్యెను.

1923 సం||లో జరిగిన నాగపూరు పతాక సత్యాగ్రహ వుద్యమములో, వినోబా పై ప్రధమముగా కారాగారమునకు వెళ్లిరి. తమస్నేహితులతో ముచ్చటిస్తూ, కారాగార జీవితము నిట్లువర్ణించిరి. "సర్కసులో మనుష్యులు జంతువులను వశంలో నుంచుకొని, నడిపించెదరు. జైలులో దీనికి పూర్తిగా వ్యతిరేకము. ఇచ్చట జంతువులు, మనుష్యులను నడిపిస్తూ వుంటారు. "నాగపూరు జైలు నుంచి, ఆకులా జైలుకి పంపబడిరి. పన్నెండు మాసముల జైలు జీవితానంతరము, 1923 సం|| సెప్టెంబరు 20 తేదీన విడుదల చేయబడిరి. వినోబాజీ అకోలా జైలుకి చేరక పూర్వము, అచ్చటి రాజకీయ ఖైదీలు, పనిచేయుటకు నిరాకరించుచుండిరి. వినోబాజీ వారికి నచ్చజెప్పుచు. శ్రమచేయక భుజించిట సాపమని, పరమేశ్వరుని ఆశీర్వచనము వలననే, తమకే శ్రమనిష్ట శిక్షణపొందే అవకాశము లభించినదని తెల్పినారు. వెంటనే ఎల్లరు దీనిని గుర్తించి, పనిచేయ ప్రారంభించిరి.

వార్ధా సమీపములోనున్న 300 గ్రామాలలో గ్రామసేవ కార్యక్రమములను ప్రారంభించిరి. 1948 సం|| వరకు వినోబాజీకిందు సంబంధ ముండెడిది. ఈసమయఘులోనే, వినోబాజీ పొలంపని, నేతపని, పాకీపని, మొదలగునని అభ్యసించిరి. స్వాభావికముగనే వారువుపాధ్యాయులు