పుట:Venoba-Bhudanavudyamamu.pdf/5

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

4


తగ్గించుటకు తాము ప్రయత్నించుచున్నామని వ్రాసిరి. వారు యీ అనారోగ్యకాలంలో చేసిన యితర పనుల వివరములు.

(1) ఆర్గురు విద్యార్థులకు ఉచితముగా గీతను బోధించెడివారు.

(2) నల్గురు విద్యార్థులకు ఆరు అధ్యయములు జ్ఞానేశ్వరి నుండి భోదించిరి.

(3) ఇరువురు విద్యార్థులకు తొమ్మిది ఉపనిషత్తులను భోదించిరి.

(4) హిందీ నభ్యసించుచు, హిందీ వార్తాపత్రికలను చదివి విద్యార్థులకు వినిపించెడివారు.

(5) ఇరువురు విద్యార్థులకు ఆంగ్ల భాషను భోదించిరి.

(6) 400 మైళ్లు కాలినడకను సంచారముచేసి, చరిత్ర ప్రసిద్ధమైన రాజఘడ్, సింహఘడ్, తోరన్‌ఘడ్, కోటలను దర్శించిరి.

(7) సుమారు 50 గీతోపన్యాసముల నిచ్చిరి.

(8) "వాయ్"లో "విద్యార్థి మండలి"ని స్థాపించిరి. పఠన మందిరాన్ని యేర్పరచిరి. పిండి విసరి, దానితో లభించిన సొమ్ముతో దీనిని పోషించెడివారు.

సత్యాగ్రహశ్రమవాసిగా యీ కాలంలో తమ ప్రవర్తన గురించి వ్రాయుచూ, "అస్వాదవ్రతం” "అపరిగృహం" అనే రెండు తానుననుసరించుచుచున్నట్లు తెల్ఫిరి. తాము సత్యాహింసలను బ్రహ్మచర్యమును త్రికరణశుద్ధిగా ఆచరించుచున్నామని, సత్యాగ్రహము చేయవలసిన ఆవశ్యకత యేర్పడిన, తెలియజేసిన తాముముందుగ రాగలమని వ్రాసిరి. వినోబాజీ లేఖకు జవాబు వ్రాయుచు, శిష్యుడు గురువుని మించిపోయినాడని, వినోబా వాస్తవంగా భీముడేఅని గాంధీజీ వుదహరించినారు. వారు తమ లేఖలో యింకా యిలా వ్రాసిరి.

"నీప్రేమ, సత్ప్రవర్తన నన్ను ముగ్ధుణ్ణిచేసినది. నీప్రవర్తనపై తీర్పు చెప్పగల సమర్థత నావద్దలేదు. నన్ను నీపిత్రుసమానునిగా అంగీకరించితివి. సంతోషము. సత్యవ్రతుడైన తండ్రికి తననుమించిన పుత్రుడుండవలెను తండ్రి అడుగుజాడల్లో నడచువాడే పుత్రుడనబడగలడు. తండ్రిలో నుండే దయ, ప్రేమ, దృఢసంకల్పము కుమారునిలో అధికంగా నుండవలెను. నాప్రమేయం లేకుండా నీవు వానిని అలవరచు కున్నావు. నీవు నన్ను నీ