పుట:Venoba-Bhudanavudyamamu.pdf/4

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

3


ముచ్చటించమని మహాత్మాజీ వినోబాజీకి లేఖ వ్రాసిరి. వెంటనే వినోబాజీ బయలుదేరి 1016 సం|| జూన్ 7 తేదీన గాంధీ మహాత్ముని కలిసిరి. వారి హృదయముల సామీప్రత, సంబంధము పెంపొందసాగెను.

వినోబాజీ నవ ఆశ్రమ జీవితము ప్రారంభమయ్యెను. సర్వం, పరమాత్మ స్వరూపమని, తాను శూన్యములోనే నుంటిననే నిర్ణయముతో ఆశ్రమమునుచేరిన వినోబాజీ, తనకర్తవ్యపాలన నిరాడంబరముగ శాంతి మార్గములో నిర్వహించెడివారు. సాయంసమయ చర్చలలోతప్ప, యితర సమయమంత ఏకాంతములో గడిపెడివారు. త్వరలోనే ఆశ్రమమంతా వారి వుత్కృష్ట ఆత్మను గుర్తించసాగెను.

వినోబాజీ తన యోగక్షేమములను తల్లిదండ్రులకు తెల్ఫియుండ లేదనే విషయమును తెలిసికొని, వెంటనే గాంధీజీ, వినోబాజీ తమ వద్ద నున్నారని, తామెన్నో సంవత్సరములవరకు సాధింపలేని ఆత్మ జ్ఞానమును, సంయముశక్తిని వినోబాజీ చిన్నవయస్సులోనే సాధింపగల్గినారని వ్రాసిరి. అనారోగ్య కారణంగా వినోబాజీ వత్సరం శలవుపై ఆశ్రమమును విడువ వలసివచ్చెను. సరిగా సంవత్సరము పూర్తికాగానే తమ గురువర్యులను చేరిరి. కొలబాజిల్లాలో వాయవ్యలోనున్న తమ స్వగృహమునకు వినోబాజీ వెళ్లిరి. మహాబలేశ్వర పర్వతముల దిగువను, కృష్ణానదీ తీరంలోనున్న మనోహరమైన, పవిత్ర ప్రదేశము “వాయ్" అచ్చట, సంస్కృత విద్వాంసులైన శ్రీనారాయణశాస్త్రి, మహరాటా "ప్రాజ్ఞపొఠశాల" అనే సంస్థను నిర్వహించుచుండెడివారు. వినోబాజీ శంకరాచార్యులు బ్రహ్మసూత్ర భాష్యములపై జరుగుచున్న వుపన్యాసములను వినుచుండెడివారు. శంకరాచార్యుల గీతాభాష్యము వినోబాజీ నిరంతర సహచారి.

1918 సం|| ఫిబ్రవరి 10వ తేదీన వినోబాజీ తాము యేవిఁధంగా యీ పన్నెండు మాసములు గడిపినది, గాంధీజీకి ఒకలేఖ వ్రాసిరి. వినోబాజీ అఖండశక్తి, యీలేఖవలన వెల్లడగుచుండెను. ఈసమయములో వినోబాజీ వుపనిషత్తులు, గీత మనుస్కృతి, ఫతంజలి యోగదర్శనం, న్యాయశాస్త్రము, వైశేషిక సూత్రము, యజ్ఞ వల్కసృతి పఠించిరి. మరియొక ఆశ్చర్యకరమైన విషయము. వినోబాజీ కొందరు సహచరులను చేర్చుకొని, దినమునకు 6.7 శేర్లుపిండి విసరెడివారు. ప్రతి దినము 10, 15 మైళ్లు నడిచేడివారు. వారి భోజన ఖర్చు రోజుకు 0-2-9 అగుచుండెను. ఇంకను