పుట:Venoba-Bhudanavudyamamu.pdf/3

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

2


మాతృదేవికి చదివి వినిపిస్తూ వుండెడివారు. వైరాగ్యం, ఆత్మార్పణం, నిస్వార్థత తమతల్లి వద్దనుండే వీరు అలవరచుకొనినారు.

1905 సంవత్సరములో వినోబాజీ తండ్రి తమ కుటుంబమును, బరోడాకు పిలిపించుకొనిరి. వినోబాజీని ప్రాధమిక పాఠశాలలో చేర్పించిరి. స్వభావ సిద్దముగా వీరు ఆధ్యాపకులుగాన, తమ ఫుత్రునకు ఆంగ్లభావ, గణితము మొదలగునవి స్వయముగ భోధించుచుండెడివారు. 1910 సం|| నుంచి వినోబోజీ వాస్తవిక విద్యాభ్యాసము ప్రారంభమయ్యెను. మహారాష్ట్ర ఋషులచే రచింపబడిన గ్రంధములయందు, జాతీయ, రాజకీయ సాహిత్యములయందున్నంత అభిరుచి వినోబాజీకి పాఠశాల విద్యాభ్యాసమున దుండెడిదికాదు. వీరు ముఖ్యంగా మంచి గణిత శాస్త్రజ్ఞలు. వీరికి గణితముపైనున్న అభిరుచియే, వారి జీవితాన్ని సక్రమమైన, నియమబద్ద మైన మార్గంలో నడిపించినది. తాము చేయదలంచిన దానిని పూర్తిగా మంధించి, ఆలోచించి, నిర్ణయించుకొను స్వభావముగల వారవుటచేతనే, వారి జీవితములో వ్యర్థ కార్యములు తలబెట్టబడలేదు.

1913 వ సం||లో "మెట్రిక్" పరీక్ష పూర్తిచేసి, “యింటరు మీడియటు"లో చేరిరి. వారికే విద్య తృప్తినివ్వలేదు. వుత్తమ కార్య నిర్వహణకై, గృహపరిత్యాగము చేయవలెనని, ఎల్లప్పుడు చింతించు చుండెడివారు. 1916వ సం||లో తమతల్లి వంటపనియందుండగా, ఆమె వద్దచేరి, తమపాఠశాల యోగ్యతా పత్రములను, తగులబెట్టిరి. తమ తల్లి యిదియేమి అని అడుగగా, లేమిక పాఠశాల విద్యఃభ్యసించ కాంక్షించుట లేదని, దానివలన లాభముండునని తమకుతోచుటలేదని తెల్పిరి

1916వ సం|| "యింటర్ మీడియట్" పరీక్షార్థమై బొంబాయి వెళ్లుచూ, సూరతునుంచి బ్రహ్మవిద్యాన్వేషణకై బనారస్ చేరిరి. బనారసు అన్న సత్రమువారిచ్చు ఆర్థిక సహాయముతో సంస్కృతభాషా భ్యాసమును ప్రారంభించిరి. అదేసమయమున విశ్వవిద్యాలయ స్నాతకోత్సవము జరిగెను. ఆ సమయములో మహాత్మాగాంధీజీ యిచ్చిన, చరిత్రాత్మక ప్రడచనం వినోబాజీని ముగ్ధులనొనర్చి, వారి నవజీవితమునకు నాందిపల్కెను. ఇరువురి జీవితములు సన్నిహితమొంద మొదలిడెను. ఇరువురి మధ్య వుత్తర ప్రత్యుత్తరములు ప్రారంభమయ్యెను. స్వయంగా సంభాషించిన, సందేహములు నివృత్తి కాగలవని, "కోచారబ్ ఆశ్రమ"మునకు వచ్చి, వివరంగా