పుట:Venoba-Bhudanavudyamamu.pdf/2

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వినోబా భూదాన వుద్యమము.

పూజ్య వినోబాజీ సంపూర్ణ జీవితచరిత్ర వ్రాయుట సులభసాధ్యమైన విషయముకాదు. ఆత్మ పరిణామమే అధికంగాగల వినోబాజీ చరిత్రను వారే స్వయంగా వ్రాయుటలోనున్న సౌలభ్యము, విశేషత యివరులకు సాధ్యముకానివి.

మహారాష్ట్ర బ్రాహ్మణ కుటుంబములో 1895 సంవత్సరము సెప్టెంబరు 11వ తేదీన, కొలాబాజిల్లాలోనున్న “గగోడి" అనే చిన్న గ్రామంలో వినోబాజీ జన్మించిరి వారి మాతృశ్రీ, రుక్మిణీదేవి. ధార్మిక చింతనగల ఆదర్శగృహిణి. వీరి తండ్రి శ్రీ నరహర శంభూరావుభావే. వుత్తమమైన శీలము, చక్కటి వివక్షనాశక్తి, క్రమశిక్షణగల ఆదర్శవ్యక్తి. వీరు ఉద్యోగరీత్యా బరోడా రాష్ట్రములో నుండుటచేత వినోబాజీ తమ బాల్యములో ఆధిక కాలాన్ని తమ తాతగారి వద్ద గడిపిరి. తాతగారైన శంభూరావు భావేగారు నిశ్చల భక్తులవుటచే, వీరి ధార్మిక ప్రభావమే, తమ ధార్మిక చింతన కధికంగా దోహదమిచ్చిందని వినోబాజీ అంటూవుంటారు.

శ్రీనరహర శంభూరావు బావేగారి ఐదుగురు సంతానములో వినోబాజీ ప్రధములు. రెండవ వారైన శౌబాలో పూనా సమీపములోనున్న వుర్లీకాంచన్‌లో మహాత్మా గాంధీజీచే స్థాపింపబడిన ప్రకృతి చికిత్సా కేంద్రాన్ని నడిపించుచున్నారు. మూడవవారైన శ్రీశివాజీభావే వేదవిద్యా పారంగతులు. వీరు వినోబాజీ రచనల పూర్తి బాధ్యత వహించి, పనిచేయుచున్నారు. నాల్గవ ఆమె, కొద్దికాలము వైవాహిక జీవితము గడిపి, చిన్న వయస్సులోనే మరణించెను. కంసారి పుత్రులు, "దత్తా,” చిన్నతనంలోనే మృతిచెందిరి. వినోబాజీవలె వారి సోదరులు శ్రీ బాల్కోవా, శ్రీశివాజీభావే కూడ ఆవివాహితులు, వీరు సేవా తత్పరులు, మరియు సర్వ సంగ పరిత్యాగ మొనర్చిన మహనీయులు.

గగోడేలో వినోబాజీ తన ప్రారంభవిద్యను ప్రకృతి మాత చెంతనే పొందెను. వీరు విస్తృతమైన గ్రంధ పఠనచేయువారు. కాని అర్థంకానిది, ఆనందింపలేనిది, చదివి, కాలాన్ని వ్యర్థపరచేవారుకాదు. వీరికి పత్రికా పఠనమందు ఆశక్తిమెండు. ఆరోజుల్లో, "కేసరి" అను పత్రికను తను