పుట:Venoba-Bhudanavudyamamu.pdf/47

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

46


సభలోని కార్యకర్తల నేత్రములనుండి భాష్పములు రాలెను. దీనితో జీవనదానము వుత్పత్తి అయ్యెను. తదుపరి వందల కొలది కార్యకర్తలు జీవనదాతలుగా ఆత్మసమర్పణ మొనర్చిరి. పూజ్యవినోబాజీగూడ, వుద్యమ నిర్మాణకులైనప్పటికి, జీవదాన మొసగిరి. సర్వోదయ కార్యకర్తలలో ప్రముఖులనేకుల జీవనదాతలుగా ఆత్మార్పణ మొనర్చిరి.

ఒక సత్కార్యము కొరకు జీవనదానమొనర్చుట నూతనవిషయము కాదు కాని ఒక విశేష కార్యసాధనకై తన జీవితము నర్పించుకొనుటయే జీవనదానము రాజకీయములు మొదలగు యితర కార్యములనుండి విముక్తులై భూదాన ఆందోళనమునకు తమ సర్వస్వమును సమర్పించవలెను. భూదాన వుద్యమమంత వుత్కృష్టమైనది. వ్యాపకమైనది, అవశ్యకమైనది మరొక కార్యములేదని గుర్తించగలవారే జీవనదానము చేయగలరు. పూజ్య వినోబాజీ "జీవనదానము" గురించి వివరించుచూ, జీవనదాతలకు లభించు లాభము లేవనగా మొదటిది ప్రజలనుండి అవహేళన, రెండవది నిరంతర పర్యటన అని తెల్పిరి. ఈ రెండు నిర్వహించిననాడు వారికి గౌరవము లభించగలదని తెల్పిరి. "ఒంటరిగనే కార్యము నిర్వహించుటకు సంసిద్ధులుగ నుండవలెను. ఇతరుల సుఖదుఃఖములలో భాగమును పంచుకొనుచు, పవిత్ర, వుదార హృదయముతో కర్తవ్యమును నిర్వహించివలెను. కామక్రోధముల నుండి విముక్తిపొంది, జీవితమును పరిశుద్ధ మొసర్చుకొనవలెను. దేశమున కుపయుక్తమైన కార్యములు నిర్వహించవలసిన మనజీవితములు పరిశుద్దముగ నుండనియెడల జీవనదానములో అర్థముండజాలదు. ఈవిషయములో ముఖ్యముగ మనమవలంబించవలసినది మనస్సుపై అంకుశముంచుకొనుట ఇంద్రియ నిగ్రహముగలిగి, విషయవాంఛలనుండి విముక్తి పొందవలెను. నిరంతరము పనిచేయుచునే వుండవలెను. రామరాజ్యనిర్మాణమునకు కృషిసల్పవలెను.

జీవనదానములో భీతినొందవలసిన విషయమేమిలేదు. కొందరు హృదయశుద్దిలేనిదే జీవనదానము చేయరాదని తలంనుచుందురు. హృదయశుద్ధి అనునది ఒకేదినము జరుగునినికాదు. అది నిరంతరము జరుగవలయును. జీవనశుద్ధికి మనము ప్రయత్నమే చేయజాలకపోయిన, జీవనదానము నిరుపయోగము కాగలదు. జీవనదానమనునది ఏవ్యక్తి నిమిత్తము చేయునదికాదు. పరమేశ్వరుని పేరుపై, ఒక మహత్తర కార్య నిర్వహణకై జీవితము నర్పించుకొనుటయే జీవనదానము. తమ కర్తవ్య నిర్వహణలో ఎన్ని 9.