పుట:Venoba-Bhudanavudyamamu.pdf/48

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

47


ఆటంకములు, కష్టములు సంభవించినప్పటికి స్థిరసంకల్పముతో శాంత, గంభీర హృదయముతో ముందుకు పోవలయును. ఇతరులు వ్యతిరేకించు నప్పటికి, ఒంటరిగనే కార్యనిర్వహణ చేయవలసివచ్చినను, ధైర్యముతో నిర్భయముగ తన కార్యమును నిర్వహించుశక్తి గలిగి వుండవలెను. జీవన దాన మొనర్చివారి జీవితములు యోగయుక్తముగ నుండవలెను. జీవితమును సమత్వముగా, నియమబద్దముగా నుంచుకొనవలెను. జీవన దానిమిచ్చు వారు తమ జీవితనిర్వహణకు యితరులపై ఆధారపడివుండరాదు. సదా చిరునవ్వుతో, వుల్లాసముతో యితరులతో కలిసి మెలసి మెలగుచూ, ఆత్మశుద్ధితో సత్యమైన, పుత్కృష్టమైన కార్యమును నిర్వహించుటయే జీవన దాత కర్తవ్యమై వున్నది.


-: నమస్తే :--


చిత్తూరు శ్రీ వేంకటేశ్వర ముద్రాక్షరశాలయందు ముద్రితము.