పుట:Venoba-Bhudanavudyamamu.pdf/45

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

44


సంపత్తి సమాజపడు లవుట దాని చివరి మెట్టు. సమాజంవైపునుండి తాను సంపత్తికి ధర్మకర్తగా వ్యవహరించుటకు వ్యక్తి సిద్దమనవలెను.

దానమిచ్చిన ద్రవ్యవినియోగం:-

(1) భూదానయజ్ఞములో భూమిహీనులకు లభించిన భూమిని సాగుచేయుట కవసరమగు సాధన సంపత్తి నిమిత్తము.

(2) భూదాన వుద్యమములో పాల్గొను కార్యకర్తలకు, గ్రామసేపకులకు వారి నిర్వాహ వ్యయముల నిమిత్తము.

(3) సర్వోదయ సాహిత్య ప్రచారమునకు.

(4) భావికాలములో వినోబాజీకాని, సర్వసేవాసంఘముగాని, యీ వుద్యమములో యితర కార్యక్రమములు ప్రవేశపెట్టిన. దాని వ్యయమునకు, దీనిని వుపయోగించవచ్చును.

దానమిచ్చిన ద్రవ్యమునుండి మూడవభాగమును దాత తన యిష్టానుసారము సార్వజనిక కార్యములకు వినియోగించవచ్చును. రైతు తన సంపత్తిదానమును ధాన్యరూపములో నివ్వవచ్చును. సంవత్సరమునకు 25 రూపాయిలిచ్చు సంపత్తిదానము నీక్రిందివిధముగా వినియోగించవలెను.

(1) ఖద్దరు ధారణకు ప్రతి 50 రూపాయల ఖరీదులో సగం సంపత్తి దానంగా పరిగణించబడును.

(2) గ్రామ పరిశ్రమలద్వారా తయారయిన నూనె, బియ్యము, పంచదార, చెప్పులు, ఆవునెయ్యి మొదలగు వస్తువులను ఖరీదుచేసిన, మొత్తంలో నాల్గవభాగం సంపత్తిదానములో చేరగలదు.

(3) చేతితో విసరిన గోధుమ పిండినుపయోగించిన, శేరుకి 1 అణా చొప్పున, ఎన్ని శేర్లు ఆయిన, దాని కూలి ఖర్చులు సంపత్తిదానములో చేరగలవు.

(4) సర్వోదయము లేక భూదాన పత్రికలలో ఒకదానికి చందా, సర్వోదయ స్వాధ్యాయ విధానమునకు చందా యిందు చేరగలవు.

(5) సంవత్సరమునకు 12 రూపాయిలు సంపత్తిదానమిచ్చు దాతలు తమ యిష్టానుసారము లేక తమవంటి దాతలతో కలసి సార్వజనిక కార్యముల కుపయోగించవచ్చును.

ఆదాయములో దానమివ్వవలసిన భాగము:-- నెలకు 50 రూపాయిలు ఆదాయంగలవారు రూపాయికి ఒక పెస చొప్పున, అనగా 64 వ