పుట:Venoba-Bhudanavudyamamu.pdf/44

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

43


యు, పార్టీలను గుర్తించమనియు, తమది ప్రజా కార్యమనియు, ఇది ప్రేమ, ఆహింసలపై ఆధారపడివున్నదనియు, స్వతంత్రజీవిగా కార్యక్రమం కొనసాగిస్తున్నామనియు, తెల్పుచుండిరి ఈ వుద్యమ వ్యాప్తి యీ మూడు సంవత్సరముల కాలములో విప్లవాత్మకరూపంలో ముందుకు సాగింది. ఫలితం స్పష్టంగావుండెను.

సంపత్తి దానము.

భూదాన వుద్యమం దేశమంతా వ్యాపించుచుండెను. కాని యీ వుద్యమములో భూస్వాములకే అవకాశముండెను. సంపత్తుగలవారికి అవకాశము లేకుండెను. భూమిలేకుండా సంపత్తివుండి, హృదయ పరివర్తన గలవారికి యిది ఒక చిక్కు ప్రశ్నగానుండెను పూజ్య వినోబాజీ ముందీ విషయముంచబడెను. వారు దీర్ఘముగా ఆలోచించి, చర్చించి సంపత్తిని కూడ సమ భాగములో దానమిచ్చుటకు ఆంగీకరించిరి. సంపత్తిదానముకూడ యీ వుద్యమములో నొక భాగమయ్యెను. సంపత్తిదానము భూదానము కన్న అశేష వ్యాప్తిగల వుద్యమముగా రూపొందగలదని విశ్వశింప బడు చుండెను. భూదాన యజ్ఞమునకేమూల సిద్ధాంతములుండెనో, సంపత్తి దానమునకుకూడ ఆవే మూలసిద్దాంతములుండెను. సంపత్తిమీదకూడు వ్యక్తికి యాజమాన్య ముండరాదని, సంఘానికే నుండవలెనని, అది సంఘ క్షేమమున కుపయోగింపబడవలెనని నిర్ణయింపబడెను. వ్యక్తి తన జీవితమున కవసరమైనంత వుంచుకొని, మిగిలినది సమాజమున కర్పించవలెను. ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సమాజమునుండే లభ్యమవుచున్న యీసంపత్తిని సమాజ హితవుకొరకే వుపయోగించిన, అందు తన హితువుకూడ మిళితిమై వుండగలదని తెలుపబడెను.

దాత తన ఆదాయములో ఒక భాగమునుగాని. లేక ఖర్చులో ఒకభాగమునుగాని దాన మివ్వవలసివుండును. ఆభాగము దాతయొక్క ఆదాయపు పరిమాణమునుబట్టి వుండగలదు. దరిద్రనారాయణుని తన పరివారములో నొకనిగా గుర్తించి, భాగమివ్వవలయును. ఆదాయమనగా ఇన్‌కంటాక్సు మొదలగు అనివార్యమైన ఖర్చులుపోగా, మిగిలిన నికరమైన ఆదాయము. దాత బుద్ధిపూర్వకముగా, హృదయపూర్వకముగా తనకున్న దానిలో భాగమివ్వవలయును. సంపత్తిదానములో యిది ప్రధామమెట్టు.