పుట:Venoba-Bhudanavudyamamu.pdf/43

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

42


భవనానికి వెళ్ళి, తలుపు తట్టగా, వారు నిద్రనుండి మేల్కొనివచ్చి తలుపు తెరచి, వారి రాకకు కారణమడిగి తెలిసికొనిరి. ఆమె జమీందారుని సోదరునిగా భావించుచున్నామని, సోదరి కార్యక్రమంలో సహాయము చేయవలెననియు కోరిరి జమీందారు జవాబు తెల్పుచూ, తాను దుర్మార్గుడనని, హృదయము లేనివాడనని, ధర్మభీతి లేనివాడనని పేరుపొందిన తమవద్ద నేవిధంగా రాగల్గినారని ప్రశ్నించెను. వినోబాజీ వుద్యమాన్ని గురించియు, వారి సందేశాన్నిగురించియు తెల్ఫి ఆమె వారిని మానసిక పరివర్తన పొందించి, 6వ భాగాన్ని దానంగా పొందగల్గెను. తరువాత, గ్రామంలోని వారినిగూడ గొనిపోయి, ప్రచారంజేసి, గ్రామంలో భూసేకరణ చేసెను. బీహారులో వినోబాజీ పేరు యింటింటా ప్రతిధ్వనించుచుండెను. భూదాన యజ్ఞ పత్రిక 60 వేలవరకు గాంధీజీ జయంతిదినిమున విక్రయింప బడెను. హిందీ కవులలో ప్రసిద్దిచెందిన 'దుఖియాల్‌' భక్తులలో ప్రసిద్ధి కెక్కిన మహారాష్ట్ర "సంత్ తుడోలు మహరాజు" కవిత్వము, భజనలు భూదాన వుద్యమాన్ని వుధిస్తము చేయుచుండెను.

ఏప్రెల్ 1951 సం||న స్వల్పంగా ప్రారంభింపబడిన భూదాస వుద్యమం, యీ మూడు సంవత్సరములలో అత్యంతాభివృద్ధి పొందుచూ వచ్చెను. మొదటి సంవత్సరము వినోబాజీ ఒంటరిగానే వుద్యమాన్ని కొనసాగించవలసి వుండెను. సేవాపురి సమ్మేళనానంతరము అనేకమంది కార్యకర్త లిందు ప్రవేశించిరి. వారిలో ముఖ్యులు శ్రీ జయప్రకాశ్ నారాయణ, శ్రీ శ్రీకృష్ణదాసు జాజు, శ్రీ వల్లభస్వామి. పండిట్ జవహర్ లాల్ నెహ్రూ, రాష్ట్రపతి డాక్టరు రాజేంద్రప్రసాద్, ఆచార్య కృపాలని మొదలగు ప్రముఖ నాయకులు. "ఈ వుద్యమ విశేషము గుర్తించగలిగిరి. ఈ వుద్యమ వ్యాప్తికి ప్రతి ప్రాంతమందు ఆయాభాషలలో వారపత్రికలు నడుపబడుచుండెను . జయప్రకాశ నారాయణ చాల సమయము యీ వుద్యమానికె వుపయోగించుచుండిరి. పార్లమెంటు సభ్యులలో ముఖ్యులైన శ్రీ సుచేతా కృపొలని ఆచార్య ఆగర్వాలాసేను గోవిందదాసు, మైదవీశరణగుప్త మొదలగువారితో ఒక కమిటీ ఏర్పాటు చేయబడెను. ప్రతి ప్రాంతములో సంచాలకులు పదయాత్రలు చేయుచుండిరి. ప్రజాషోషలిష్టుపార్టీ, జనసంఘపార్టీలు కూడ యీ వుద్యమానికి సహాయపడు తీర్మానములుచేసి, ప్రచారముచేసిరి. వినోబాజీ తాము ఏపార్టీకి చెందనివారమని