పుట:Venoba-Bhudanavudyamamu.pdf/42

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

41


కాని సమావేశాల్లో చాలమంది ప్రేక్షకులు హాజరవుతూ వుండేవారు. 7 డిసంబరున "సహర్ష" జిల్లాలో ప్రవేశించిరి. 21 వ తేదీవరకు పర్వటించి “దర్భంగా" జిల్లాలో ప్రవేశించిరి. ఖాదీ పరిశ్రమకు ప్రసిద్ధిచెందిన, “హులస్ పట్టి” (గ్రామం చేరిరి. ఖాదీయొక్క ప్రాముఖ్యతను గురించి వుపన్యసించుచు, దానాల్లో ఆది గుప్తదానమని, దరిద్రనారాయణ సేవకొరకు అందరు ఖాదీ ధరించవలెనని వినోబాజీ అన్నారు. "దర్భంగా" జిల్లాలలో కనిసం 3 లక్షల దానపత్రాలైనా సేకరింపబడాలని కోరిరి. 6 లక్షల కుటుంబాలు, 36 లక్షల జనాభాగల యీజిల్లాలో లెక్కవేసి, ఆదిన పత్రాలను వినోబాజీ గోరిరి.

1954 సం|| జనబరి 10వ తేదీన గంగా, గుండకన్ నదులను దాటి పాట్నాకు 8 గంటలకు చేరిరి. మూడురోజులు విరామములేని కార్యక్రమములో భూదాన వుద్యమవ్యాప్తిని గురించియు, ప్రేమ, బుద్ధి, సంపత్తి శ్రమదానాలు గురించి ప్రచారం చేసిరి. 4 వ తేదీన బీహారు ప్రాంతములో జిల్లా భూదాన నిర్వాహకుల సమావేశం జరిగెను. 12వ తేదీన బీహారు ప్రదేశ కాంగ్రెసుకమిటీ సభలో వినోబాజీ ప్రవచించిరి. స్త్రీలసభలో, విద్యార్థుల యువకుల సభలలోగూడా వినోబాజీ పాల్గొనిరి 15 దినములు "పాట్నా" జిల్లాలో పర్యటించి, నాల్గవసారి జాతిపిత వర్ధంతి దినమైన జనవరి 30 వ తేదీన వినోబాజీ "గయ" జిల్లాలో ప్రవేశిస్తూ, బాపూజీ (Do or die) అనే ప్రవృత్తిని నేర్పించాలని అన్నారు. "గయ" జిల్లాలో భూదాన సేకరణ పూర్తికాకుండా, యీజిల్లాను విడువమని, చావో, బ్రతుకో తేల్చుకోవాలని అన్నారు. భారతదేశపు దృష్టంతా "గయ" జిల్లావైపు ప్రసరించినదని, కార్యకర్తల బాధ్యత, శ్రద్ధమీదనే వుద్యమ ఫలితం ఆధారపడివుందని అన్నారు. భూదాన వుద్యమంలో దేశంలో స్త్రీలుకూడు కార్యకర్తలుగా పనిచేయుచుండిరి. శ్రీమతి జానకీదేవి బజాజీ గాంధీజీ జన్మదినోత్సవ సందర్భమున 108 కూపదానాలు (బావులు) 80 తులాల బంగారము సేకరించి, వినోబాజీకి అర్పించిరి. స్త్రీ కార్యకర్తల కార్యసాధన తెలిపే గాధలనేకములు భూదాన వుద్యమ చరిత్రలో గలవు. వుదాహరణ బీహారులో ఒక గ్రామంలో నైతిక ప్రవర్తనలేని కఠిన హృదయముగల దుర్మార్గులైన జమీందారుండెను. అతని పేరన్న చుట్టుప్రక్కల గ్రామములో ప్రజలు భీతిల్లుచుండిరి. ఒకదినము ఒక స్త్రీ కార్యకర్త, వారి