పుట:Venoba-Bhudanavudyamamu.pdf/41

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

40


తాము రాగలమని వినోబాజీ తెల్పగా, పండా అంగీకరించిరి. 19-వ తేది సాయం కాలము వినోబాజీ కొందరు హరిజనులతోను, తమ సహచరులతోను దేవాలయమునకు వెళ్ళిరి. దేవాలయమును సమీపించగనే, కొందరు పండాలు "ధర్మానికి జై, అధర్మానికి నాశనం" అని నినాదాలుచేసికుంటూ లాటీలతో వినోబాజీపై పడిరి. వినోబాజీకి చెవివద్ద స్వల్పంగా గాయములు తగిలెను. వారి సహచరులలో కొందరు తీవ్రంగా గాయపడిరి. శాంత మూర్తియైన వినోబాజీ తిరిగివచ్చిరి. మరుసటిదినము పత్రికాప్రకటనయిస్తూ అజ్ఞానమువలననే పండా లావిధంగా ప్రవర్తించినారని, యిందుకు వారిని శిక్షించవలసిన అవసరంలేదని, తమ సహచరులెల్లరు యీ సందర్భమువ వుద్రేక మొందక , శాంతముతో ప్రవర్తించినందులకు తమకు సంతోషము కలిగినదని, ఈవిధమైనస్థలాలను ప్రభుత్వమె నిర్వహించుట పుచిపమని, యిది తమ సూచనమాత్రమేనని అనినారు. ఈ సంఘటన పరిణామంగా, దేవాలయంలో హరిజనప్రవేశవిషయంలో ప్రజలకు తీవ్రచింతనచేసి, దీర్ఘంగా ఆలోచించే ప్రవృత్తినిచ్చినది. బీహారులోని 'దర్భంగా' మహారాజు వినోబాజీని కలసి 1,18,800 ఎకరముల భూమి దానమిచ్చెను. ఇతరులకుకూడ దానమిచ్చుటకు నచ్చచెప్పగలమని వాగ్దానము జేసిరి. భూదాన వుద్యమవ్యాప్తికి మూడు సూచనలును వినోబాజీ యిచ్చిరి. భూమిహీనులందరు ఐక్యతతోనుండి, భూమిగలవారి బెదిరింపులకు జంకకుండుట, భూమిహీనులు శుభ్రమైన , స్వచ్ఛమైన ఆలవాట్లను, నియమాలను అనుసరించుట, శాంతివిధానంలో భూమిగలవారికి న్యాయాన్ని నచ్చజెప్పుట అని తెల్పిరి. కార్యకర్తల సమావేశంలో వుపన్యశించుచూ, వినోబాజీ, కార్యకర్తలెవరు ఎవరిగురించి చెడుగా మాట్లాడరాదని, ఎవరియందైనా తప్పువున్న, వానికి ప్రేమతో నచ్చజెప్పేప్రయత్నించాలని, ప్రతి వ్యక్తిలో ఏదోకొంత మంచివున్నదని, దానిని గుర్తించుటయే తన కర్తవ్యమని తలంచవలెనని హితవిచ్చిరి. మన వుద్యమంపైనను, దాతలోనున్న మంచితనముపైనను, పూర్తి విశ్వాసంలో కార్యకర్తలు వుద్యమాన్ని కొనసాగించాలని కోరిరి. దీనమంటే భిక్షమడుగుట కాదని, దినమన్న సమవిభాగమని, ప్రేమభావంతో, సోదరభావంతో దాతలకునచ్చచెప్పాలనికోరిరి. “పూర్ణియా" జిల్లాలో వినోబాజీ యాత్రలో 44,500 ఎకరముల భూదానం లభించినదని, 'పూర్షియా' జిల్లాలో వుత్తరప్రదేశంలోని తాలూకాలలో లభించినంత దానంకూడా లభించలేదు.