పుట:Venoba-Bhudanavudyamamu.pdf/40

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

39


శిబిరము మూడుదినములు నడిపించబడెను.

"హజారిబాఘ" జిల్లాలో యాత్రఅంతయు వినోబాజీ "రామఘర్" రాజా పాల్గొనెను. ఈ రాజా కేంద్రస్థానమైన "పద్మా" చేరగనే, కుటుంబీకులు 2,000 ఎకరముల భూమి దానమిచ్చెను. వినోబాజీ శ్రమదినములో రాజాకూడ పొల్గొనెను. వినోబాజీ యీ సందర్బమున ఈవిధముగా అనిరి. “ఈదినము తెల్లబట్టలవారుకూడా భూమిత్రవ్వే కార్యక్రమములో పాల్గొనిరి. కాలముమార్పు నిది తెల్పుచున్నది. ఈరోజు ఎవరు ఆధిక తెల్లబట్టలను ధరించ వాంఛించుటలేదు. మన భగవంతుడు కృష్ణుడు "కృష్ణ" అన్న నలుపుఅనిగాని వ్యవసాయము చేయువాడినికాని అర్థము. హిందూదేశములో వ్యవసాయముచేయు ప్రతి వ్యకి నల్లగనుండును. నల్లరంగుని మనం పూజించెదము. అందరు పనిచేయాలని, పనిచేయకుండా భుజించుట పాపమని గుర్తించెస్థితి వచ్చినది. వినోబాజీ "హజారిబాఘ్" లో నుండగా గోరక్షణకై వుపవాసముచేయుచున్న “శ్రీరామచంద్రశర్మవీర్"ని కలసిరి. వినోబాజీ తెల్పినప్రకారము, వీరు తమవుపన్యాసాన్ని విరమించిరి. 'హజారీబాఘ్‌' జిల్లాలో 7,01,497,75 ఎకరముల భూమి 5091 దాతలనుండి లభించెను. గయపట్టణములో భూదానసహాయకసమితి వారు వినోబాజీని కలిసిరి. ఇది కొందరు జమీందారులతో యేర్పరచబడివుండెను. వారు వినోబాజీతో బీహారు కోటా అయిన 32 లక్షల ఎకరములు సేకరించుటకు తెల్పిరి. వినోబాజీ పాట్నాజిల్లాలో పర్యటించుచున్నప్పుడు కుంభవృష్టివి వర్షములు కురియుచుండెను. అయినప్పటికి తమ పదయాత్రను నిలుపలేదు. వర్ష బిందువులు భగవంతుని ప్రేమపూర్వక ఆశీర్వాదములంటూ అతి వుత్పాహంతో యాత్ర జరిపించిరి 'కైజోరి' గ్రామంలో వుపన్యసించుచూ, సోదరప్రేమను గురించి తెల్పుచూ, ప్రస్తుతసమయం మిత్రులమధ్యనుండే సమానతను కోరుచున్నదని, నేటికాలాని కనుగుణంగా సమాజాన్ని నిర్మించుకోవలెనని, పూర్వకాలనియమాలెంతవున్నతమైన వైనప్పటికీ, మూఢవిశ్వాసంతో వానిని అదేవిధంగా యీరోజు అనుసరించలేమని, వానిని కాలానుగుణంగా సరిదిద్దుకొనవలెనని అన్నారు. 18. 19 వ తేదీలు వినోబాజీ బీహారులోని 'థియోఘర్‌' గ్రామంలో గడిపిరి. 18 వ తేది సాయంకాలము వైద్యనాథదేవాలయమునకు చెందిన పండా, బాబాజీని దేవాలయుధర్శనమునకు ఆహ్వానించిరి. హరిజనులకుగూడ దేవాలయప్రవేశ మంగీకరించిననే