పుట:Venoba-Bhudanavudyamamu.pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

38


లేదు. వినోబాజీ తిరిగి "గయ" పట్టణమునకు వచ్చినప్పుడు బీహారురాష్ట్ర కాంగ్రెసు సంఘము, వినోబాజీ కోరినప్రకారము, 32 లక్షల ఎకరముల భూమి సేకరించుటకు అన్ని కాంగ్రెసు కమిటీలు కృషిసల్పవలెనని తీర్మానించెను. 31 ఆగష్టు 1953 నాటికి ప్రతిజిల్లా తమతమకోటాను పూర్తిచేయవలెననిగూడ తీర్మానించాను. "రంకే" గ్రామంలో నుండగా ఆ గ్రామ రాజు వినోబాజీని కలిసి, తాను ఒక కార్యకర్తకు 2,500 ఎకరముల భూమిని, మరియొక కార్యకర్తకు 11,000 ఎకరముల భూమిని దానమిచ్చినట్లు తెల్పెను. వినోబాజీ యీ బేధమునకు కారణమేమని అడుగగా, వారెంతఅడిగిన అంత తామిచ్చినట్లు తెల్పిరి. వెంటనే వినోబాజీ తమకేమివ్వగలరని ప్రశ్నించినా, కోరినంత యివ్వగలమని జవాబిచ్చిరి. తమకు లక్షఎకరముల బంజరుభూమి, 9,000,10,000 ఎకరముల మధ్య స్వంతముగా వ్యవసాయంచేసికోనే భూమి వుందని, దీనినుంచి సుమారు 3,000 ఎకరముల భూమి రైతులకై ప్రత్యేకింపబడియున్నదని రాజా తెల్పగా, వినోబాజీ వారి బంజరుభూమినంతను స్వంతముగా వ్యవసాయము చేయుచున్న భూమిలో 6 వ భాగము దానమిచ్చుటకు కోరగా వెంటనే రాజాగారు అంగీకరించిరి. ఆవిధముగా "రంక" రాజా 1,02,001 ఎకరముల భూమిని దానమిచ్చెను. వినోబాజీ తమ వుపన్యాసములో యీవిషయమై పేర్కొనుచు, దీనిని పూర్ణదానమని తెల్పిరి. "రాంచీ" జిల్లాలో "నెటారహట్" గ్రామంలో నుండగా, ఆ జిల్లా భూదాన సంచాలకులైన పాలకోటరాజా 45,132 ఎకరముల భూదానాన్ని సేకరించి సమర్పించిరి. రంక రాజావలె తమ బంజరుభూమినంతయు, వ్యవసాయములోనున్న భూమిలో 6వ భాగమును, మొత్తం 44,500 ఎకరములు భూమిని స్వయంగా దానమిచ్చిరి. 15 జూన్‌న, వినోబాజీకి 632 సుంది దాతలనుంచి 1,401 ఎకరములు భూమి దానమియ్యబడెను. దీనిని వినోబాజీ విష్ణుసహస్రనామపఠమని పేర్కొనిరి. భూదానచరిత్రలో యిన్ని దానపత్రములు లభించుట యిదే ప్రథమము. 16 జూన్ నుంచి వినోబాజీ తమ కార్యక్రమములో నూతనవిధానాన్ని ప్రవేశపెట్టిరి. తమ మకాంచేరగనే, కొన్ని పొరలు తెప్పించి, ఆరమైలుదూరములోనున్న బంజరుభూమిని త్రవ్వుటకై తమ సహచరులతో బయలుదేరిరి. దినమునకు 17 నిముషములు త్రవ్వెడివారు. క్రమక్రమంగా దినమునకు 1 నిముషము చొప్పున యీ కాలాన్ని పెంచుతూవచ్చిరి. “రంబి" లో బీహారుప్రదేశ భూదాన కార్యకర్తల పతనం సమపథమని పేర్కొనను దానమివ్వబడెను. దీనిని