పుట:Venoba-Bhudanavudyamamu.pdf/36

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

35


చేసికొని వుండలేదు. ఇది చరిత్రలో సువర్ణాక్షరములతో లిఖింపబడ గలదు? మరుసటిదినము వినోబాజీ సంపత్తిదానము గురించి బహిరంగ సమావేశంలో వివరించిరి.

“భూదాన వుద్యమం వ్యాప్తి పొందుచున్న కొద్ది, దీని మూలసిద్ధాంత ప్రాప్తికి యీ వుద్యమాన్ని యింకను విస్తరింపజేయవలసివున్నది. దీనికి సంపత్తిలో భాగముగూడ దానమివ్వవలయును. సంపత్తిలో 6వ భాగమిచ్చుటకు నేను కోరుచున్నాను. ఆపైన ప్రజలు తమ కర్తవ్యాన్ని గుర్తించి, తమ శక్యానుసారము నిర్ణయించుకొనవచ్చును." "సంపత్తిదానమునకు నిధులు, విరాళములకు భేదమున్నది. సంపత్తిదానమున్న రాబడిలో ఒకభాగము ప్రతిసంవత్సరము దానమివ్వవలెను. దానమిచ్చిన సొమ్ము దాత వద్దనే వుండును. మేము తెల్పునట్లు, ఆతడు అసొమ్మును ధర్మకార్యములకు వినియోగించవలెను. ప్రతిసంవత్సరము దానిలెక్కలు మాకు పంపుచుండవలెను". 25 అక్టోబరున భూదాన యజ్ఞ మున సమర్థించుచూ, బీహారు రాష్ట్ర కాంగ్రెసు సంఘము ఏకగ్రీవముగా నొక తీర్మానముజేసెను. ఏ రాష్ట్ర కాంగ్రెసు సంఘముగాని, భూదాన వుద్యమ విషయములో యీ విధమైన గంభీర చింతనచేసి, ముందడుగు వేయుట యిదే ప్రథమము. 28 ఫిబ్రవరి 1953 వ నాటికి బీహారులో 4 లక్షల ఎకరముల భూమి సేకరించబడవలెనని, ఇందునిమిత్తమై, బీహారులోని కలతలు, ప్రభుత్వములోని కాంగ్రెసు శాసనసభ్యులు, ఇతర కాంగ్రెసు కార్యకర్తలెల్లరు తీవ్రమైన కృషిసల్పి, లక్ష్యసిద్ధికి తోడ్పడవలెనని, యిది జయప్రదముగ కొనసాగింపబడుటకు ప్రప్రధమముగా, కాంగ్రెసువారందరు తమకున్న భూమిలో 6వ భాగము దానమివ్వవలెననియు, ఆ తీర్మానములో పేర్కొనిరి. ఆ తీర్మానము. శ్రీ వైద్యనాద్ చౌదరీచే బీహారుప్రాంత కాంగ్రెసు సంఘ కార్యదర్శిచే ప్రతిపాదింపబడి, శ్రీ ప్రభునాద్‌సింగుచే బలపరచబడెను. శ్రీ వైద్యనాద్‌ప్రసాదుగారిప్పుడు పూర్తిగా భూదాన కార్యక్రమంలోనే నిమగ్నులై వున్నారు. ఇదేదినమున బీహారు సర్వోదయ కార్యకర్తలు కూడ భూదానము గురించి ఏకగ్రీవముగా ఒక తీర్మానముజేసిరి. ఆశ్చర్యకర విషయమేమన, యీ తీర్మానము బీహారు ప్రాంత ప్రజా సోషలిష్టు సంఘ అధ్యక్షులైన శ్రీ చందాసాహెబుచేత ప్రతిపాదింపబడి, కాంగ్రెసు నాయకులైన శ్రీ జగత్ నారాయణలాల్ చే బలపరచబడెను. ఈవిధంగా 45 దినములలో,