పుట:Venoba-Bhudanavudyamamu.pdf/35

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

34


వున్నతభావాలలో పనిచేయాలని వినోబాజీ కోరినారు. ప్రార్థన సమావేశంలో వుపన్యసించుచూ, యాత్రీకుడు భగవంతుని దర్శనమునకై తీర్థయాత్రలు చేయునట్లు తాము భూదానయాత్ర చేయుచున్నామని, మానవునకు దానప్రవృత్తి లేనియెడల హీనస్థితినొందగలడని, కాని ప్రేమమూలమైన క్రాంతిని తాము కోరుచున్నామని తెల్ఫిరి. 18 సెప్టంబరున "దమారు" లో వుపన్యసించుచూ, వినోబాజీ బీహారుప్రజలు తమ వాటాను పూర్తి చేయుటయే లక్ష్యమని తలంచక , బీహారులో భూమిహీను లెవరు వుండరాదనే నిశ్చయానికి పనిచేయాలని, యీ రాష్ట్రంలో భూసమస్య పూర్తిగా పరిష్కరింపబడి యితరరాష్ట్రాలకు ఆదర్శప్రాయము కావలయునని కోరిరి. ఆహింసా సూత్రముతో భూసమస్యను హిందూదేశములో పరిష్కరించిన, యావత్తు ప్రపంచానికి మార్గంచూపగలమని, బీహారులోనే ప్రప్రథమముగా గాంధీజీచే ప్రారంభింపబడిన అహింసా సిద్ధాంతమును పునర్జీవితిం చేయాలని కోరిరి. పాట్నా జిల్లాలోని "భప్రా” గ్రామములో వుపన్యసించుచు, తాము కేవలం భూమి పంపిణినే కోరుటలేదని, గ్రామపరిశ్రమలు నెలకొల్ప బడాలనికూడా కోరుచున్నామని అనిరి. గ్రామవస్తువుల ఖరీదు అధికమనుట తప్పని, విషము చౌకగాను, అమృతము పిరియముగా నున్నప్పటికి విషమును వాంఛించమని వుదహరించిరి. 23 అక్టోబరున వినోబాజీ పాట్నా నగరములో ప్రవేశించి, మూడుదినము లచ్చట గడిపిరి. బీహారులోని భూ సమస్యను పూర్తిగా పరిష్కరించకోరుచున్నామని, ప్రతి ప్రాంతమునకు వెళ్ళి, స్వయంగా భూమి సేకరించుట అనేది కష్టసాధ్యమేగాక, అధిక కాలాన్ని కోరుతుందని, బీహారుని ఆదర్శప్రాంతముగాచేసి, దాని అనుసాసారంగా యితర ప్రాంతములలో పని జరుపవలెనని తాము కోరుచున్నామని తెల్ఫిరి.

ప్రారంభములో బీహారులో అంతవుత్సాహముగా పని జరుగలేదు. అప్పటికిని వినోబాజీ ధృడవిశ్వాసముతో, తమ కార్యక్రమాన్ని కొనసాగించినారు. బీహారు రాష్ట్రములో భూసమస్య పరిష్కరింపబడువరకు తామారాష్ట్రమును విడువమని తమ నిశ్చయాన్ని వినోబాజీ 23 అక్టోబరు తేదీన వెల్లడించిరి. దీని ప్రభావము బీహారుపైననేగాన, యావత్తు దేశముపై బడెను. హిందూదేశములో ప్రజాప్రభుత్వము నెలకొల్పినతరువాత, యీ విధమైన ఆశ్చర్య జనకమైన, చారిత్రాత్మకమైన, విచిత్ర నిర్ణయము నెవరు