పుట:Venoba-Bhudanavudyamamu.pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

33


"వార్ధా"లో వుండడము నాకెంతో బలము నిచ్చినది. అబలము అదేవిధంగా ఇక ముందుగూడ సాగగలదు. గీతలోతేల్పినట్లు కిశోర్ లాల్ భాయె సకర్మ, ఆకర్శలకు వుదాహరణములు. వారు బుద్ధభగవానుని స్థాయికి చెందిన వారని నేను తలంచుచున్నాను

రెండు దినముల తదుపరి వినోబాజీ జన్మ దినోత్సవ సందర్భమున వుత్తర ప్రదేశములో కార్యకర్తలతో మాట్లాడుచూ భూసమస్య పరిష్కారమగు వఱకు పరంధామ ఆశ్రమమునకు తిరిగి వెళ్ళమని తిర్మానించుకొన్నట్లు తెల్పిరి. వినోబాజీ వుత్తర ప్రదేశం నుంచి వెళ్ళే ఆఖరి దినము వచ్చెను' "ఆల్ మోరా" జిల్లా తప్ప వుత్తరప్రదేశమంతా పర్యటించిరి. 257 స్థలముల యందు 295028 ఎకరముల భూమిని, 231 బావులు, 1 గొట్టముబావి, 34 ఎడ్ల జతలు, 6 గృహములు, 1 భవనము, 1 ధర్మశాల, 11 నాగళ్లు, 1000 రూ. విలువగల వ్యవసాయ పనిముట్లు, 4 నీళ్లు చేదు బకెట్లు 1 లక్ష 30 వేల ఇటుకలు, 15 సంచుల సిమెంటు, 4 చెఱువులు, 15500 రూ, విలువగల 531 వృక్షములు, విత్తనములు, శ్రమదానముల మొత్తం 4 లక్షల ఎకరముల విలువగల దానం 12 వేల మంది దాతల వద్ద నుంచి లభించినది. మొత్తం 3750 మైళ్లు పదయాత్రను జరిపించిరి. ఇదంతా భగవంతుని ఆశీర్వచనబలమువలననే నెరవేర గల్గినదని వినోబాజీ పేర్కొనిరి.

14 వ తేదీ ఉదయం వుత్తరప్రదేశములోని "పైయిద్ రాజ" నుంచి వినోబాజీ బయలుదేరిరి. కర్మనాశి నదిఒడ్డున "బీహారు" లో ప్రవేశించుచున్నారు. శీతలపవనములు వీచుచుండగా, నక్షత్రములు మిలమిల మెరయు చుండగా వీడ్కోలు విషాదచ్ఛాయలు కార్యకర్తల ముఖములలో ప్రస్పుటమగుచుండగా వినోబాజీ పడవనెక్కి "బీహారు" సరిహద్దులకు ప్రయాణము సాగించిరి,

బీహారు సరిహద్దులలో స్వాగతమిచ్చిన కార్యకర్తలతో మాట్లాడుచూ వినోబాజీ బీహారులో 4 లక్షల ఎకరములు సేకరించుటకు నిర్ణయింపబడినప్పటికి, 50 లక్షల ఎకరముల భూమి సేకరించినగాని బీహారులోనున్న భూమిహీనుల సమస్య పరిష్కరింపబడజాలదని అన్నారు. బీహారులో మొదటిమకాం “సహబారు" జిల్లాలోని దుర్గావతిలో నుండెను. ఘోషా స్త్రీలతోసహా ప్రజలు వినోబాజీకి అఖండ స్వాగతమిచ్చిరి. సాయంకాలము జరిగిన కార్యకర్తల సమావేశంలో మాట్లాడుచూ, విశాలహృదయాలలో,