పుట:Venoba-Bhudanavudyamamu.pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

32


వేశములోను, స్త్రీల సమావేశములోను, సాహిత్య సమావేశములలోను గూడ వుపన్యసించిరి. ఈజిల్లాలో 25561 ఎకరముల భూధానము లభించినది. ఇంత వరకు యేజిల్లాలోను ఇంత భూమి లభించియుండలేదు. వారి కోటాను లక్ష ఎకరములు నిర్ణయించుకొనుటకు కొరుచూ అన్ని పార్టీల వారు ఈవుద్యమములో పాల్గొనవలెనని, భగవదానుసారము తామీ కార్యన్ని కొనసాగించుచున్నామని తెల్పిరి.

వుత్తరప్రదేశంలో కట్టకడపటిజిల్లాయైన "మీర్జాపూరు” జిల్లాలో వినోబాజీ ప్రవేశించిరి. “చూనారు"లో నుండగా వుత్తర ప్రదేశ ప్రభుత్వము జమీందారి రద్దుదినమును జరిపిరి. దీనితో ఎట్టి సంబంధము వుంచుకొనని వినోబాజీ సాయంకాలపు సమావేశములో భాధతో మాట్లాడుచూ దేశములో భూమి హీనులున్నన్ని దినములు, ఏవుత్సవము వలనను, ఆనందము లభించజాలదని వీరిస్థితి హీనాతి హీనముగ నున్నదని. మనము కొంత త్యాగము చేస్తేగాని, వారి వున్నతి జరుగజాలదని హిందూదేశ పౌరుడు తనతోటి భూమిహీనుడైన సోదరునకు సహాయపడినప్పుడే ప్రపంచ పొరుడు తనతోటి భూమి హీనుడైన సోదరునకు సహాయపడినప్పుడే ప్రపంచ పౌరుడు కాగలడని తెల్పినారు. 1952వ సం|| జూలై 4వ తేదీన వినోబాజీ తిరిగి "కాశీ" చేరిరి. వర్షఋతువు గడుపుటకై వారచ్చట సుమారు 2 నెలలు గడిపిరి. ఇప్పటికి దేశములో మొత్తము 296634 ఎకరముల భూదానము లభించింది. సేవాపురి సమ్మేళ నానంతరము అధిక సంఖ్యలు భూదాన పత్రములు లభించినవి. కాశీ విద్యా పీఠములో వినోబాజీ 70 దినములు నివశించిరి ఒక దినము గంగాస్నానమునకు వెళ్లిరి. ప్రజలు పాయిఖానాగా ఆప్రదేశము నుపయోగించుట జూచి వినోబాజీ సహించ లేక పోయిరి. తమప్రదేశమును పరిశుభ్రముగా నుంచుకొనవలెనని స్వచ్చ భారత మనేది సార్థకంగా చేయాలని "కాశీ" ప్రజలను కోరిరి. 1952 సం|| సెప్టెంబరు 9 తేదీన "వార్థా"లో శ్రీ ఆచార్యకిషోర్ లాల్ ఘనశ్యామేదాసు మరణించినట్లు వార్తచేరెను. ఈవార్తను గురించి, వినోబాజీ ఈ విధంగా చెప్పినారు. “నావుపన్యాసము లన్నింటిని నేను సరిచూడకనే వారికి పంపెడివాడను. వారిమీద అంత విశ్వాసము నాకుండెను, వాటిని మార్పుజేసిన. సరిదిద్దినా వారేదానికి తగిన ఆర్హులు. భూదాన వుద్యమమునకు తమసర్వస్వాన్ని అర్పించినవారు వారొక్కరే. వారు