పుట:Venoba-Bhudanavudyamamu.pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

31


తన అపార సేవాలను ప్రజల హృదయములలో ప్రముఖస్థాన మేర్పరచు కొనియుండిరి. గ్రామములో తనకున్న భూమినంతా వినోబాజీకి దానమిచ్చి తమయభిప్రాయములను వెల్లడించిరి. గ్రామమంతా గ్రామదానంగా సమర్పించుటకు ప్రజలకు ప్రభోధించెను. గ్రామములో మొత్తము 105 కుటుంబములుండెను. వానిలో 65 కుటుంబములు భూమి గలిగి, 40 కుటుంబములు భూమిలేనివిగా నున్నవి. శ్రీషత్రుఘనసింగు ప్రయత్న ఫలితంగా 64 కుటుంబములు దాన మిచ్చుటకు అంగీకరించెను. ఈగ్రామ ప్రజలందరు భూమికి యజమాని పరమేశ్వరుడే అనే సత్యాన్ని పూర్తిగా గ్రహించగలిగిరి. ప్రధమ భూధానము లభించినప్పుడు వినోబాజీ ఎంత అనంత మనుభవించిరో అంత ఆనందము ఈవిచిత్ర సంఘటన వలన వారికి లభించినది. తులసీదాసు నామము ప్రఖ్యాతిపొందిన "బందా" అను జిల్లాలో 20000 ఎకరముల భూదానం లభించినది. త్వరలోనే మరి 80000 ఎకరముల భూమిని సేకరించుటకు వాగ్ధానము జేసిరి. 36 సం||లకు పూర్వము గాంధీజీని ప్రప్రథమము గావలసిన ప్రవేశమైన "ఫతేపూర్" జిల్లాకు వినోబాజీ 7 జూన్ 1952 తేదీన చేరిరి.

"ఫతేపూర్,” రాయబరేరి," "సుల్తాన్ పురము," "ప్రతాపఘర్," జిల్లాలలో పర్యటించి 1952 సం!! జూన్ 23 తేదీన "ఆలహాబాదు" జిల్లాలో ప్రవేశించిరి. శ్రీ పురుషోత్తమదాస్ టాండన్ మొదలగు ప్రముఖముల స్వాగత మిచ్చిరి. శ్రీ టాండన్ మాట్లాడుచు వినోబాజీ ఒక తపస్విఅని, వారిచుట్టూ విచిత్రమైన నూతన వాతావరణంలో శాంతి ఆవరించియున్నదని అన్నారు. సాయంకాలము ప్రార్థనానందర సమావేశములో వుపన్యసించుచు, వినోబాజీ తాము కేవలం భూమే కోరుట లేదని, ప్రజల హృదయములను కోరుచున్నానని, ప్రేమతో దానమిచ్చే ప్రతివ్యక్తి భూమినేగాక, తనహృదయాన్నిగూడ పంచి యివ్వగలడని అన్నారు. ఈకార్యం సంపూర్తిఅయ్యే వఱకు తాము విశ్రాంతి పొంద దలంచుటలేదని తెల్పిరి. జూన్ 24వ తేదీన కుంభ వృష్టిగా కురియుచున్న వర్షములో "అలహాబాదు" పట్టణము చేరిరి. విద్యా రంగములోని, సంస్కృతిలోను, అభివృద్ధిపొందిన "అలహాబాదు"లో వినోబాజీ సామ్యయోగ సిద్ధాంతమును వివరించిరి. ఇచ్చట జమీందారుల సమావేశములోను కూలివారుల సమావేశములోను, పత్రికా రచయితల సమా