పుట:Venoba-Bhudanavudyamamu.pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

30


తలు వివిధ ముఖములైవున్నది. ఆర్థిక, సమాజిక ఔన్నత్యము మన మనుసరించే మార్గముపై ఆధారపడియున్నది. మన సమస్యాపరిస్కారమునకు వుత్తమ పద్ధతిని దీర్ఘంగా ఆలోచించి నిర్ణయించుకొనవలసివున్నది. ఆహింసా యుతంగా సమస్యాపరిష్కారం జరిగిన, మనభారత దేశానికేగాదు, యావత్తు ప్రపంచానికి చగ్కటి బాటను చూపగలము. ఈనాడు ప్రపంచాన్ని ఎదుర్కొనుచున్న సమస్యలలో భూసమస్య పెద్దది. భూమిగలవారు తమ ధర్మాన్ని గుర్తించి, భూమి హీనులకు తమకున్న దానిని పంచి యివ్వవలయును. బుద్దునిచే ప్రారంభింపబడిన కార్యమున కాపరమేశ్వరుడు నా ద్వారా కొనసాగించుచున్నాడు. విశ్వాశంతో యాకార్యాన్ని మనం శాంతి, అహింసా మార్గాలద్వారా సాధించగల్గిన, హిందూదేశం యావత్తు ప్రపంచమునకు మార్గదర్శి కాగలదు."

లక్నోను వదలి, మే 13 తేదీన వినోబాజీ కాన్పూరు చేరెను. జిల్లా మొత్తము కోటాను ప్రథమ దినముననే సేకరించిన మొట్టమొదటి ప్రదేశ మిదియే. ఇచ్చట సుమారు 13,000 ఏకరముల భూధానం లభించినది. వినోబాజీ కాన్పూరు కోటాను లక్ష ఎకరములకు పెంచిరి. ఇచ్చట వినోబాజి, హరిజనుల కాలనీని ప్రారంభించిరి. ఈసందర్భములో వుపన్యసించుచు ప్రజల ప్రతిష్ట వారి వున్నతమైన భవనాలపై ఆధారపడి వుండ జాలదని, హరిజన వాడలపైననే ఆధారపడి వుండగలదని, బలహీనులు పరమేశ్వరుని శక్తిని అనుభవించగలరని అన్నారు. ఉత్తర ప్రదేశములో ప్రపధముగా వినోబాజీ "కాన్పూరు" జల్లాలోని "పుప్రాయను" గ్రామంలో భూపంపిణీ జరిపినారు. భూపంపిణి సమావేశాన్ని ప్రారంభిస్తూ, భూపంపిణీ అత్యధిక ప్రేమతోను, న్యాయముగాను, జరుగవలెనని తెలిపిరి. మే 18వ తేదీన వినోబాజీ బుందేలఁఖండు ప్రాంతములో ప్రైవేసించిరి. ఇచ్చట “హమిరె పూర్" జిల్లాలో "బెట్వా" గ్రామం నుంచి "ఇటాలియా" అను గ్రామంచేరు. దారిలో నున్న "మనెగ్రోత్" అనే గ్రామంలో 101 ఎకరములు భూధానం లభించినది. వారిచ్చిన దాన పత్రములు స్వీకరించుచు, వినోబాజీ "భూమియంతా గోపాలునది" అని అంటూ తమపదయాత్రను సాగించిరి. ఈమాటలు గ్రామస్థుల హృదయములలో చొచ్చుకొనిపోయెను. ఆ గ్రామములోనే గౌరమనీయమైన శ్రీమంతుల కుటుంబమునకు జెందిన దివానె షత్రుఘన సింగు అనువారు