పుట:Venoba-Bhudanavudyamamu.pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

29


విడిచి, వినోబాజీ వుత్తరప్రదేశములో మిగిలియున్న 15 జిల్లాల యాత్ర ప్రారంభించిరి.

మే 1వ తేదీన ఫైజాబాదులో నుండగా ప్రపంచమంతటను కార్మికదినము జరుపబడెను. ఈ సందర్భమును పురస్కరించుకొని, వినోబాజీ తమ వుపన్యాసములో తమవుద్యమం కార్మికులకు సంభందించినదేనని, సాధారణంగా హిందూదేశములో ఈవిధమై కార్మిక వుద్యమములు పట్టణాలలోనే కొనసాగింపబడుచున్నవని, రైతు కార్మికులకు ఏవిధమైన నిర్మాణాత్మకమైన సంస్థలేదని అన్నారు. వ్యవసాయంతప్ప ఇతర ఏవృత్తులు వీరభ్యసించుటలేదని, హీనాతి హీనస్థితిలో భూమి హీనులై ఇతరుల పొలాలలో పని చేయుచున్నారని వివరించిరి. “నావుద్యమం కార్మిక వుద్యమం. స్వయంగానే నొక కార్మికుడను, 32 సం||లు కార్మికులుగా పనిచేసినాను. సంఘముచే నీచవృత్తులుగా పరిగణింపబడుచున్న పాకీపని, నేతపని, పొలం పని, వడ్రంగిపని, చేసితిని. నేటి వుద్యమం భూసమస్యను పరిష్కరించ గలదు. ఆహార వుత్పత్తి నభివృద్ధిచేయగలదు. గ్రామ రాజ్యములను స్థాపించ గలదు. ప్రభుత్వముపై ఒత్తిడితీసికొని రాగలదు. ప్రజల ఆధ్యాత్మిక చింతనను పెంపొందించగలడు. ప్రజల నైతిక జీవితమును తీర్చి దిద్ది తదయా పుదారతనము పెంపొందించగలదు". వినోబాజీ లక్నోలో నుండగా బుద్ధజయంతివచ్చెను. ఆదినము హృదయము విప్పి వినోబాజీ అనేక విషయములను గురించి వుపన్యసించిరి. “బుద్దుని భోదనలు క్రమక్రమంగా నేడు గుర్తింపబడుచున్నవి. బుద్దునిమొదలు మహాత్మాగాంధీజీవరకు, వందలకొలది యోధులు శాంతములో క్రోథాన్ని జయించగలమని అధైర్యమును ధైర్యముతోను, శత్రుత్వమును ప్రేమతోను, జయించగలమని భోదిస్తూవచ్చిరి. కాని అవియన్ని వ్యక్తిగత పరిశోధనలవరకే సాగింపబడివుండెను. వీనిని విస్తరింపజేసి సమాజాన్వితము చేయలేదు.

హిందూదేశము అహింసాసూత్రము ద్వారనే స్వరాజ్యం సంపాదించుకొన గల్గినదని నేను అనజాలును. గీతలో చెప్పినట్లు యేఫలితమునకైనను పంచ సూత్రములు అవసరము. హిందూదేశ స్వాతంత్ర్య ప్రాప్తిలో అహింసా విధానం ప్రముఖస్థానం ఆక్రమించి యుందని మాత్రము చెప్పవలసివున్నది. మన సమాజ నిర్మాణాన్ని నిర్ణయించుకొనుటకు మనకీరోజు స్వాతంత్ర్యము ద్వారా స్వేచ్ఛలభించినది. మనదేశం పెద్దది. మన భాధ్య