పుట:Venoba-Bhudanavudyamamu.pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

28


ఇచ్చటి ప్రజలు అత్సుత్సాహముతో వినోబాజీ సందేశములను వినిరి. అనేకమంది కమ్యునిష్టులుగూడ వీరి సమావేశములకు హాజరవుటయేగాక, స్వాగతపత్రములనుగూడ సమర్పించిరి. ఘజపూరు జిల్లాలో ఒక గ్రామంలో నూలువడికే కార్యక్రమంలో కొందరు గ్రామస్థులు పాల్గొనిరి. ఆశ్చర్యకరమైన విషయమేమన్న ఇద్దరు స్త్రీలు తమ నేత్రములను బంధించుకొని నూలువడకిరి సాయంకాల సమావేశంలో వుపణ్యసించుచు సూర్యకాంతిగాని, చంద్రకాంతిగాని లేని చీకటిసమయములో రామనామస్మరణతో నూలువడకుట అత్యుత్తమ విధానమని ప్రతివారు స్వయంగా నూలువడకి, తమబట్టను తయారుచేసుకొనేవరకు. దేశంలో పేదరికం తొలగింపబడదని అన్నారు. ఏప్రెల్ 13, 14, 15, 16, తేదీలలో సేవాపురిలో శ్రీ శ్రీ. కృష్ణదాసు బాబూజీ అధ్యక్షతన చతుర్థ వార్షిక సమ్మేళనము జరిగెను. ఈసమయమునకు, దేశంలో మొత్తం 1 లక్ష 2 వేల మూడువందల ఆరవైఒకటి ఎకరముల భూమి 4936 మంది ధాతలనుండి సేకరింపబడెను. ఈసమ్మేళనమును ఆచార కృపలా ప్రారంభించిరి. వినోబాజీ తమ త్రివిధములైన కార్యక్రమ విధానములను వివరించుచు, సమ్మేళన సందర్భమున, ప్రతివ్యక్తి గాంధీజీ స్మారకంగా ఒక్కొక్క చిలుప, తాను స్వయంగా వడికి ఇవ్వవలెనని సర్వోదయ స్థాపనకు, ఒక్కొక్క చిలుక ఒక్కొక్క ఓటు కాగలదని అన్నారు. తమ రెండవ విధానాన్ని వివరించుచు, ప్రతిసంస్థ ధనంనుంచి విముక్తి పొందవలెనని, దీనివలన గ్రామోద్దరణ, దేశోద్ధరణ జరగగలదని, దీని ప్రభావము ప్రభుత్వముపైగూడ పడగలదని అన్నారు. తమ మూడవ విధానం భూదాన యజ్ఞమని, ఇదేసమాజ, విప్లవమునకు మూలసూత్రమని అంటూ, "కార్యకర్తలు విశ్వాసంతో త్రికరణ శుద్ధిగ పనిచేసిన సఫలత లభించగలదు. కర్త్వుత్వము శ్రద్ధను అనుగరించును." నిష్ట కర్తృత్వమును అనుసరించును. నైతిక శక్తితో సమస్యా పరిష్కారము పొందదలచిన, మనంధృఢ విశ్వాసముతో కార్య రంగములో కృషి చేయవలె"నని తెల్సినారు. సేవాపురిలో సమావేశమైన కార్యకర్తలెల్లరు నూతన వుత్సాహముతోను, ఆశతోను, తమతమ గృహములు చేరిరి. రెండు సంవత్సరములలో 25 లక్షల ఎకరముల భూమి సేకరించుటకు నిర్ణయించుకొనిరి.

సేవాపురి సమ్మేళనము భూదాన వుద్యమమునకు ఒక చారిత్రాత్మక మార్గమునిచ్చి అభివృద్ధిన సూచించినది. 20 ఏప్రేల్ 1952 తేదీన సేవాపురి