పుట:Venoba-Bhudanavudyamamu.pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

27


రముల భూదానం లభించినది. వినోబాజీ ఈవుత్తర ప్రదేశ యాత్రలో గ్రామ జీవితాన్ని చిత్రించే అనేకమైన దృశ్యాలు కనుగొనబడినవి. వానిలో నుండి మూడింటిని మాత్రము పుదహరించుచున్నాము. మొరడాబాద్ జిల్లాలోని చౌధాపూరు గ్రామంలో రాత్రి 1గం||కు వినోబాజీని కలియుటకు రామచరణ్ ఆనే అంధుడు వారి మకాంకు వచ్చిరి. ఒక కార్యకర్త వీరిని చూచి కారణము విచారించగా పేదలకొఱకు బాబా భూమిని ప్రోగు చేయుచున్నారని తాము విని వుంటిమని తమవద్దనున్న 12 సెంట్ల భూమిని తాము దానమివ్వదలంచుచున్నామని తెలిపి, దానపత్రవ్రాసి యిచ్చి, 6 మైళ్ళు నడచి, తిరిగి వెంటనే తమ గ్రామమునకు వెళ్ళిపోయిరి. మరుసటి దినము సమావేశములో ఈసంఘటనను గురించి మాట్లాడుచూ వినోబాజీ రామచరణ్ అంధుడని పేర్కొనబడుచున్నారని, వానివాస్తవానికి మన మందరము ఆంధులమని ఆన్నారు. రామచరణ్ రూపంలో పరమాత్ముడే ఈభూదాన యజ్ఞాన్ని ఆశీర్వదించుటకు విచ్చేసినారని తెల్పినారు.

నైన్‌తాల్ జిల్లాలోని "కలమాంగి" అను గ్రామంలో ఒకవృద్ధురాలు బాబాజీ పేదలనిమిత్తము భూదానాన్ని సేకరించుచున్నారని విని తనగ్రామమునుంచి నడచివచ్చి రాత్రి 11 గం|| వచ్చి మకాంచేరెను. అందరు నిద్రించుచుండిరి. ఉదయము 3 గంటలకు వినోబాజీ కార్యదర్శియైన శ్రీ దామోద దాసు మందాడ ప్రార్ధన గంటనుకొట్టి, కాలకృత్యములు తీర్చుకొనుటకు వెలుపలకు రాగా ద్వారమువద్ద కూర్చునివున్న ఆవృద్ధనారీమణిని జూచిరి. ఆమెతనభూమిని ఒక ఇంటినికూడ దానమిచ్చి, వెంటనే సంతోషముతో తన గ్రామము తిరిగి వెళ్ళిపోయెను.

గోరక్‌పూర్ జిల్లాలో ఒక గ్రామములో ప్రవేసించగనే గీతములతోను, హారతులతోను గ్రామస్త్రీలు వినోబాజీని స్వాగతము పాడిరి. ఒకవృద్ధ నారీ ముందుకువచ్చి, మిక్కిలి సిగ్గుతో తనకు 12 సెం|| భూమి వుందని, తనకు 5గురు పుత్రులున్నారని, బాబూజీని తన 6వ. వానిగా స్వీకరించి, 6వ, భాగమైన 2 సెంట్లు భూమినివ్వ వాంచించుచున్నామని తెల్పిరి. వినోబాజీ అతివినయముతో దానిని స్వీకరించి, ఈ రెండు సెంట్లు 2 లక్షల ఎకరములతో సమానమని, ఆమాతృదేని ఆశీర్వచనము తమకు లభించినదని, సాయం సమావేశములో పేర్కొనినారు.

సీతాపురినుండి వుత్తర ప్రాంతములోనే తూర్పుజిల్లాలో పర్యటించిరి.