పుట:Venoba-Bhudanavudyamamu.pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

26


స్థానంలో నున్నామని, నేటిసమస్యను అహింసానూత్రముద్వారా పరిష్కరింపబడిని యెడల, సర్వనాశనం కాగలదని, దీనిని సాదించవలెనన్న దేశంలోని అన్నిశక్తులు అత్యుత్తమ స్థానంలో కృషిసల్పాలని కోరిరి సర్వోదయ కార్యకార్తలెల్లరు, తమ సర్వశక్తులను యీవుద్యమానికి అర్పించాలని కోరిరి. ఉత్తర ప్రాంతములో భూదాన వుద్యమాన్ని నడిపించిన ప్రధాన వ్యక్తులు శ్రీబాబా రాఘవదాసు, మరియు శ్రీ కరస్‌భాయి. ఢిల్లీనుంచి వినోబాజీ మీరటప్రవేశించిరి. ఆచ్చట వుపన్యశించుచూ, భూదానవుద్యమం కేవలం భూసేకరణకే కాదని, ఇది సమాజక మూల సూత్రములను మార్పు జేసేదని యిది అహింసద్వారా హిందూదేశం యేవిధంగా సాధించగలదని యావత్తు ప్రపంచం ఎదురుచూచుచున్నదని అన్నారు. 30. సపంబరు తేదీన వినోబాజీ మీరటు జిల్లాలోని "సర్దాన" నుంచి "కతేలి" వెళ్ళుచుండగా మార్గంలో సైకిలుతో ఢీకొనిరి. వినోబాజీక్రింద పడిరి. దెబ్బతగిలెను. కానివారు మామూలుగా తమ పదయాత్రను కొనసాగించిరి. తీవ్రమైన గాయాలు తగిలినప్పటికి, వారు తమ కార్యక్రమమును మార్చ అంగీకరింప బడకుండిరి. క్రమంగా ఆబాధ అధికమయ్యెను. వినోబాజీ మాత్రము తమ నిర్ణయ ప్రకారము కార్యక్రమము కొనసాగించిరి. డెరఫస్ జిల్లాలోని “కాల్సి" లో వుపన్యశించుచూ పూర్వం రాజులు అశ్వమేధయాగం చేసే వారని, తాము ప్రజాసూయయాగమును కొనసాగించుచున్నామని అన్నారు. వినోబాజీ భూదానముగాక, బావులు, ఎడ్లు మొదలగు వ్యవసాయ పనిముట్లనుగూడ దానమడుగ ప్రారంభించిరి. ఉత్తరప్రాంతములోని రోహిల్ ఖండులో నున్నప్పుడు ఎన్నికల సమయముండెను. ఈఎన్నిక తీవ్రతలో భూదాన వుద్యమం జరుగుట కష్టసాధ్యమని, కొన్నిదినములవఱకు దీని నాపు జేయమని కొందరు వినోబాజీని కోరగా, తాము పరమేశ్వరుని ఆజ్ఞాపాలకులని, భగవంతండేకోరిన తమ కార్యక్రమమేగాక, తామె సమాప్తిచెందగలమని అన్నారు. ఎన్నికల కార్యక్రమం తీవ్రంగా జరుగుచున్నప్పటికి, వినోబాజి ప్రవచనములకు ప్రజలు అధికముగా హాజరవుతూ వుండెడివారు. భూదానంకూడ యధాప్రకారం లభించెడిది.

ఉత్తమ ప్రాంతములోని 18 జిల్లాలలో తమ పదయాత్రను పూర్తి చేసికొని, వినోబాజీ 22 ఫిబ్రవరి 1952 తేదీన, "సీతాపురం"లో ప్రవేశించిరి. ఈ 90 దినముల యాత్రలో 1,747 దాతలనుండి 28,308 ఎక