పుట:Venoba-Bhudanavudyamamu.pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

25


విదేశాలనుంచి దిగుమతులను నిలిపి, దేశంస్వయంపోషకమవుటకు, ధృఢ నిశ్చయముతో, పట్టుదలతో కృషిసల్పాలని కోరిరి. ఈవిషయములో ప్లానింగు కమీషను వీరితో నేకీభవించక, కొంతకాలమువరకు ఆహారపదార్థముల దిగుమతి అవసరమని అన్నారు. నిరుద్యోగ సమస్యనుగురించి మాట్లాడుచూ, ప్రతివ్యక్తికి వెంటనే వృత్తిచూపుట ప్లానింగు కమీషను కర్తవ్వమని వినోబాజీఅనగా వారంగీకరించిరి. కాని ప్రస్తుత పరిస్థితులలో అది వెంటనే సాధ్యము కాజాలదని తెల్పిరి. వినోబాజీ తమవుద్దేశ్యములో ఈసమస్య పరిష్కారమగు వరకు యేజాతీయ ప్రణాళికరచన జరుగజాలదని, దీనిని అంగీకరించిన నాడే గ్రామాలకు స్వయం సమృద్ధిచేయగలదని తమ అభిప్రాయమును వెల్లడించిరి. ప్లానింగ్ కమీషను, వినోబాజీ తమతమ అభిప్రాయాలలో ఏకీభవించలేక పోయిరి. ఇరువురి ఆశయము దేశాభివృద్ధియే అయినప్పటికి యిరువురి మార్గాలు ఏకము కాలేక పోయినవి. పదకొండు దినములు రాజధానిలోగడిపి, 24 నవంబరు 1951 తేదీన వినోబాజీ తమ పదయాత్ర తిరిగి వుత్తర ప్రదేశమునకు ప్రారంభించిరి.

VII

భూదాన వుద్యమం కేవలం తెలంగాణాలోనే గాక, యితర ప్రాంతాలలోకూడ గుర్తింపబడుట, దీనిని సమయమే కోరుచున్నదనే విషయం విశదపరచుచున్నది. ఢిల్లీవిడచి, వినోబాజీ వుత్తర ప్రాంతమంతట పర్యటించుటకు నిర్ణయించుకొనిరి. ఈరాష్ట్రమునుంచి కోటి ఎకరముల భూమిని కోరిరి. దీనిలోనుంచి మొదటి కోటాగా, 5 లక్షల ఎకరముల భూమిని ఒక సంవత్సరములో సంపాదించుటకు వుత్తరప్రదేశ నిర్మాణ కార్యకర్తలు నిర్ణయించుకొనిరి. ఈవిధంగా ఒక నిర్ణయమైన వుదేశ్యముతో గమ్యాన్ని చేరుటకు ప్రయత్నించుట, భూదాన వుద్యమంలో యిదే ప్రారంభము. ఇదిభూదాన వుద్యమచరిత్రలోని ముఖ్యమట్టం. మధురలో కార్యకర్తల సమావేశంలో పుపన్యశించుచూ, వినోబాజీ మనదేశముయొక్క ప్రత్యేకత దీని ఆధ్యాత్మిక చింతనలో వుందనియు, ఏమహత్తర ఆత్మవలన హిందూదేశం ఒకవిశిష్టమైన విధానములో స్వరాజ్యాన్ని సంపాదించగల్గినదో, దానిఆధారంపైననే వుద్యమంకొనసాగింప బడుచున్నదని, అవిశ్వాసం తోనే తాము భూదాన వుద్యమ లక్ష్యం 5 కోట్ల ఎ|| భూమి సేకరణ అని నిర్ణయించినామని అన్నారు. జాతీయ చరిత్రలో నేడుచాల క్లిష్టమైన