పుట:Venoba-Bhudanavudyamamu.pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

24


చుండును. ధరలు వుత్పత్తినిబట్టిగాక, సొమ్మునుబట్టి నిర్ణయింపబడుచున్నవి. ధనవిలువలోనే హెచ్చుతగ్గులు భేధములున్నవి. ధనమంత అపనమ్మకముగ, అనిశ్చితముగనున్న , దీనిఆధారముతో వ్యాపారమెందుకు జరుగవలెను? దీనికి జవాబు నాకేల స్ఫురించుటలేదు? ఆర్థిక శాస్త్రవెత్తలను దీనిని తెలిసికొనుటకు కోరితిని. కాని వారికిగూడ సాధ్యము కాలేదు." దీనిఅర్థమువినోబాజీ జీవితములో ధనావశ్యకతను గుర్తించలేకపోవుటలేదు. ఒకసందర్భములో వారన్నట్లు, భగవంతునివలె సర్వవ్యాప్తమైన యీధనాన్ని జీవితంనుంచి తొలగించుట సులభసాధ్య మవునది కాదు. కాంచనముక్తులవుట అన్ని, స్వాతంత్ర్య జీవితములను గడుపుటఅని, ధనాపేక్షవలననే ప్రజలనేకమైన వక్రమార్గములవలంభించుచున్నారని వినోబాజీ ఆన్నారు. వినోబాజీ వారి నాణెముల విధానమును వివరించుచు "నేనుధనమునకు వ్యతిరేకిని కాదు. నాణెములకన్న కాగితములనే అధికంగా నేను బలపరచుదును. కాని నేను కోరే నాణెములు శ్రమరూపములోనుండును. విఆ నాసిక్ లో అచ్చుచేయబడవు. అవి గ్రామస్టులతోనే వారి వుపయోగార్థము నిర్ణయించబడును. ఈ విధానములో పరపత్తి ప్రశ్నయే వుండదు" తమ ప్రణాళికను వివరించుచు “నాప్రణాళిక వికేంద్రీకృత రాజ్య నిర్మాణమును స్థాపించగలదు. ఇది భగవంతుని సృష్టిలోనే వున్నది. అనవిధముగా కోరియుండని యెడల భగవంతుడు తెలివినంతా ఢిల్లీలో ఏదో బ్యాంకులో పెట్టి వుండెడివాడు. ఆవిధానము ప్రయత్నించి, విఫలుడై వుండుటచేతనే, వికేంద్రీకృత విధానాన్ని అనుసరించి, పాలసముద్రములో పొందగల్గుచున్నాడు." ఆని వినోబాజీ వివరించినారు. గ్రామపరిశ్రమ క్షీణదశను గురించి మాట్లాడుచూ ప్రత్తిపండే స్థళములలో గ్రామములు బట్ట తయారు చేసి కొనగలవని, కానీ ఖాదీఅన్న ఆర్థిక శాస్త్రకారులెల్లరు వెనకాడుచుందురని అన్నారు. "గ్రామములను ఖాదీవుత్పత్తిచేయనీయకపోవుట బూర్జువిధానమనబడగలదు ఈవిషయములో బూర్జావకాదులు, కమ్యునిష్టులు ఏకీభవించుచున్నారు. ఇరువురకు వుత్పత్తి విధానములో ఒకేయభిప్రాయము గలదు. వుత్పత్తి పంపకములో వీరు బేధాభిప్రాయము గలిగివున్నారు. తెలిసియో, తెలియకయో బూర్జువావిధానము ఖాదీవిషయములో అనుసరింపబడుచున్నది."

ఢిల్లీచేరిన తదుపరి మూడుదినములు ప్లానింగు కమీషనువారితోను, నెహ్రూజీతోను, సంభాషించిరి. ఆహార వుత్పత్తిగురించి మాట్లాడుచు,