పుట:Venoba-Bhudanavudyamamu.pdf/37

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

36


జనకుడు, బుద్ధుడు, మహావీరుడు, గాంధీ మొదలగు మహాత్ముల ప్రదేశమైన, బీహారులో అహింసాయుత విప్లవమునకు అనుకూలమైన వాతావరణ మేర్పడెను. కాని వినోబాజీకి తృప్తికలుగలేదు. తమ దృష్టినంతా ఒక జిల్లాలో కేంద్రీకృతముచేయ నిర్ణయించుకొనిరి. ఈ వుద్దేశ్యములో 28 అక్టోబరుతేదీన వినోబాజీ "గయ" జిల్లాలో ప్రవేశించిరి.

దీర్ఘ చింతనానంతరము బుద్ధభగవానుని యీజిల్లాలో లక్షఎకరాల భూమి లభించవలెనని ప్రకటించిరి. బుద్ధగయలో మాట్లాడుచు వినోబాజీ బుద్ధుడు, వేదాలు, ఋషులుచేసిన భోదనలనే, ఆనుసరించుచు, వారి అడుగుజాడలలోనే తాము సంచరించుచున్నామని తెల్పిరి. తమ కార్యదర్శి అయిన శ్రీ దామోదరదాసు ముందాడును, వారి కార్యభారమునుంచి తొలగించి, యీ జిల్లాలో తమ ఆశయసిద్ధికై తీవ్రప్రయత్నము చేయుటకు కోరిరి. శ్రీగౌరీశంకర్ శరణ్‌సింగు అధ్యక్షతన 'గయ' జిల్లాలో భూదాన సేకరణ సమయ మేర్పరచబడెను. 22 నవంబరున "పాలమౌ" జిల్లాలోని “చాందనా" గ్రామంలో ఒకేదినమున 400 దాన పత్రములు సమర్పింప బడినది. ఇంతవరకు యేదినమునకూడా యిన్ని దానపత్రములు సేకరింప బడలేదు.

"రాంచీ" జిల్లాలో, పాల్‌కోట జమీందారు లాల్ సాహెబు, హృదయపూర్వకమైనసేవ భూదాన వుద్యమమునకు చేయగలమని తెల్పిరి. “సింగభూమి” జిల్లాలో ప్రవేశించిన తదుపరి వినోబాజీకి జబ్బుచేసెను. వారు నడువలేని స్థితిలో నున్నప్పటికీ, కార్యక్రమము జరుపుటకు పట్టుబట్టిరి. ఎడ్లబండిలో ప్రయాణముచేసి, “మానభూమి” జిల్లా ప్రవేశించిరి. కాని వారి యారోగ్యమింకను క్షీణించెను. బండిపైకూడ వెళ్ళలేని స్థితి యేర్పడెను. పంచమ సర్వోదయ వార్షిక సమ్మేళనమువరకు, వినోబాజీ "చాండిల్" లోనే వుండిపోయిరి. ఈ క్రింది పట్టిక సేవాపురి, చాండిల్ సర్వోదయ సమ్మేళనముల మధ్య కాలములో భూదాన వుద్యమ అభివృద్ధిని తెలుపగలదు. అనగా మే 1952 నుంచి ఏపిల్ 1953 వరకు లభించిన భూమి వివరములు.

ఈసమయములోని అతిముఖ్యఘటన యేమన, శ్రీ జయప్రకాష్ నారాయణ, తమ యావత్తుశక్తిని భూదాన వుద్యమం కొరకు వినియోగించ గలమని ప్రకటించుట, మరియొక ఆశ్చర్యకరమైన విషయం. ధనవంతులపై