పుట:Venoba-Bhudanavudyamamu.pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

20


అన్నారు. ప్రభుత్వ ప్రణాళికనైతే విమర్శించితిమి గాని దానికి నిర్మాణాత్మక మైన సూచనలు ఇవ్వలేక పోయితిమేయని ఆరాత్రంతా చాలాచింతించిరి. నిర్మాణ కార్యకర్తల సంఘములను సమావేశపరచి చుట్టుప్రక్కల గ్రామాలలో తమ ఆశయసిద్ధికి కృషిసల్ఫమని కోరగా వారువెంటనే పని ప్రారంభించిరి. వినోబాజీ తీవ్రమైన వాస్తవుమైన విమర్శ నెహ్రూజీని చేరినది. వినోబాజీతో వివరములు చర్చించుటకై ఢిల్లీ విచ్చేయుటకు నెహ్రూజీగారిని కోరిరి. కాలినడకను ఢిల్లీ చేరుటకు 12 సెప్టెంబరు 1951 తేదీన వినోబాజీ ఫవునారుమండి బయలుదేరిరి. 11 సెప్టెంబరు పవునారులో వుపన్యసించుచూ తాము ప్రారంభించినది భూదాన యజ్ఞమని, అది కేవలము భూదానమునకు సంబందించినదే కాదని ఆయజ్ఞములో అందురు సహకరించ వచ్చునని తెల్చినారు. ఈయజ్ఞ ముఖ్యోద్దేశమును గుర్తించగల్గిన ధనవంతులు పేదవారిని గౌరవించి దానమివ్వగలరని ఈవుద్యమము ఫలించిననాడు సమాజములో అహింసాత్మక విప్లవము రాగలదని అన్నారు. ఆక్షణముననే 75 ఎకరముల భూదానము లభించినది.

దినమునకు 12, 16 మైళ్ళు కాలినడకను ప్రయాణముచేయుచు, వినోబాజీ శ్రీ జె.సి. కుమారప్పగారి పన్నై ఆశ్రమములో మొదటిమకాం జేసిరి. నాగపూరులో వుపన్యశించుచూ పరమేశ్వరుడు తమకు శక్తినిచ్చినంత కాలము దేశాటనచేస్తూ భూమిహీనులకు భూమిసంపాదించి యివ్వ గలమని తెల్పిరి. నాగపూరులో నిర్మాణ కార్యకర్తల సమావేశములో ఉపన్యసించుచూ ఆహింసాత్మక విప్లవముద్వారా సమాజ వ్యవస్థనుమార్చే వాతావరణాన్ని సృష్టించాలని యిదినా పేదరికపు సమస్య పరిష్కరింప బడజాలదని అన్నారు. గాలి, నీటిమీద అందరికి సమానహక్కు వున్నట్లే భూమిమీదగూడ అందరికి సమానహక్కు గలదు. జనశక్తిని పెంపొందించుటను, ప్రజాశక్తిద్వారానే ఈసమస్యను పరిష్కరించుకొనవలెనని కోరిరి. ప్రభుత్వ సహకారములేకుండ ఈసమస్య పరిష్కరించ బడగలదాయని ప్రశ్నించగా వినోబాజీ ప్రజారాజ్యములో ప్రభుత్వమన్న ప్రజాభిప్రాయమేనని, ప్రజలకోరికను ప్రభుత్వము తప్పనిసరిగా నెరవేర్చవలెననిఅన్నారు. 11 వ. సెప్టెంబరునుండి 17వ. సెప్టెంబరువరకు 111 మై|| ప్రయాణముచేసి సగటున దినమునకు 200 ఎకరముల చొ||న 2000 ఎకరములు సంపాదించిరి. ఈసగటున తెలంగాణాలోని 200 ఎ|| సగటును పోల్చినదీని అభివృద్ధి విశ