పుట:Venoba-Bhudanavudyamamu.pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

21


దమవగలదు. ధనవంతులను, పేదవారిని అందరిని దానమివ్వమని కోరెడివారు. పేదవారే అధికముగా వీరిభావాన్ని గుర్తించగలిగిరి. సెప్టెంబరు 18వ నుండి 27 వరకు 2311.49 ఎ|| భూమి 201 ధాతల నుండి లభించినది.

గ్రామములలోను, అంతేగాక పేదవారి వద్దనుండి ఆధికమూగా భూదానము లభించినదని తెలియుచున్నది. పేదవారి నైతికశక్తి ప్రేరణ వలననే ధనవంతులుకూడ క్రమక్రమంగా దానమివ్వ ప్రారంభించిరి. ఈ రోజు ఇవ్వనివారు రేపైనా యివ్వవలసి వుండునని హిందూదేశములో దాన మివ్వమని ఎవ్వరూ నిరాకరింపజాలరని వినోబాజీ అన్నారు. 2వ అక్టోబరు 1951 వ తేదీన సాగరుచేరిరి. ఆరాష్ట్ర నిర్మాణ కార్యకర్తలెల్లరు సమావేశ మైనారు. అసమావేశములో పుపన్యసించుచు తమ వుద్యమము సేవా తత్పరతలోను, ఆత్మార్పణముతోను కూడివున్నదని ఇదిసర్వ ప్రజలకు సంభందించినదని కార్యకర్తలు త్రికరణశుద్ధిగా పనిచేయవలెనని కోరిరి. ఈసమావేశములో తమ పంచవర్ష ప్రణాళికయైన 50000000 ఎ|| భూమి 1957 వ సం||నకు సంపాదించవలెనని బహిర్గతపరిచిరి. “నాపొట్ట చిన్నదైనప్పటికి దరిద్రనారాయణపొట్ట చాలాపెద్దది. కాన నాకు 5కోట్ల ఎకరముల వ్యవసాయభూమి కావలెను కుటుంబములో ఐదుగురుకుమారులున్న నన్ను 6వ వానిగాను నల్గురున్న ఐదవవానిగాను, అంగీకరించి, దేశములోని వ్యవసాయభూమిలో 5.వ భాగముగాని, 6వ భాగముగాని దానమివ్వ కోరుచున్నాను. ప్రతిఒక్కరు ఈవుద్యమములో భాగము పంచుకొని, దరిద్రనారాయణుని పూజించండి." ప్రస్తుత భయంకరసమాజస్థితిని వివరించుచు నేటి ఆర్థిక జీవితవిధానమే మోసాలకు ద్రోహాలకు కారణమని దీనినిమార్చ గలిగిన యావత్తు ప్రపంచానికి హిందూదేశ ప్రజలు ఆదర్శమూర్తులు కాగలరని అన్నారు. 7.వ అక్టోబరుతో వినోబాజీ మధ్యప్రదేశయాత్ర పూర్తి యయ్యెను. 563 ధాతలనుండి 6700 ఎ|| భూదానము లభించెను. వీరిలో 541 నుండి దాతలు 25 ఎ|| కన్న తక్కువ భూమికలవారు. 9 గురు 25.50 ఎకరముల మధ్యను, 13 100 ఎ|| కన్న అధికము గలవారు.

3 దినములు ఉత్తర ప్రదేశమున పర్యటించి 11 వ అక్టోబరు వింధ్య ప్రదేశమున వినోబాజీ ప్రవేశించిరి. ప్రఖ్యాత హిందీకవి శ్రీ బనారాసీదాను చతుర్వేది వినోబాజీతో 5 దినములుండిరి. ఈప్రాంత ప్రజలు వినోబాజీ దర్శనమువలన అమితానంద మొందిరి. మహ్మాత్మాజీ వారిజీవిత కాలములో