పుట:Venoba-Bhudanavudyamamu.pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

19


రము చేయు మానవత్వముననే ఎవరు ఎన్నడు చూచివుండరు.

వినోబాజీ యాత్రలో అనేకమంది విద్యావంతులు వారిని వారివుద్యమాన్ని పరిహసించుచుండెడివారు. ఎవరిని విరోధులుగా తలంచలేని వినోబాజీ వీరి అపహస్యములకు, విమర్శలకు. ప్రత్యుత్తరమే యిచ్చెడివారు కారు వారొక సందర్భములో తెల్పినట్లు వారికి ఫలానా కార్యముచేయవలెననెడి ఆశగాను, ఫలానాకార్యము చేయరాదనే వ్యతిరేకతగానిలేదు. తమఅంతర్వాణి పిలుపునేవారు వినగలరు. దాని అనుసారముగానే కాలినడకను హైదరాబాదు వెళ్ళుట, అచ్చటనుండి తెలంగాణాకుపర్యటించుట జరిగెను. తెలంగాణలో ప్రారంభమైన ఉద్యమము వినోబాజీలో ప్రజ్వలింప సాగెను. ఈసందర్భములో పంచవర్ష ప్రణాళికా రచనా సందర్భముగా శ్రీ ఆర్. కె. పాటిల్ వినోబాజీ అభిప్రాయములు గైకొనుటకై వినోబాజీని ఆహ్వానించిరి. వెంటనే వినోబాజీలోని అగ్నిబయల్వెడలెను. ఉద్రిక్తులై మిక్కిలి విచారముతో ఈవిధముగ వ్రాసెను ["రాజ్యాంగములో ప్రతిఒక్కరికి తిండి, పనివాగ్దానముజేసి వున్నారు. దానిని పూర్తిగా విస్మరించితిరి. ఎవరి భుజస్కందముల పై ఈభాద్యత మోపబడినదో వారు ఈ కార్యాన్ని నిర్వహింపజాలని యెడల రాజీనామా ఇవ్వండి. మీరుకుటుంబ ప్రణాళికను సూచించినారు. దీని పరిష్కారము సంతాననిరోధకము కాదు జీవితాన్ని సక్రమ మార్గములో నడిపించుట.]

గ్రామ పరిశ్రమలను నాశనముజేసి యిప్పుడు వాని సహాయము కోరుచున్నారు. ఆప్రతికూల దినములలోనే గాంధీజీ అంతపనిచేయకల్గిన అంతకన్న అత్యధికముగా యిప్పుడెందుకు చేయగలమని తలంచలేదు? 1951 సం|| సకు ఆహారస్వయం సమృద్ధికి వాగ్దానము చేసిరి. దానిని నెరవేర్చలేక ఆహారస్వయం సమృద్ధి అకుంభవమనే ప్లానింగ్ కమీషసును పిలచివారు. యుద్దమొచ్చిన దేశస్థితి ఎట్లుండునో పూహించినారా? మీప్రణాళిక నిరంతర భిక్షాటన ఇదిఎవరిని అధికోత్పత్తి చేయుటకు ప్రోత్సహించ జాలదు."

ఖాదీ విషయములోను. గ్రామ పరిశ్రమల విషయములలోను, , ప్రభుత్వము చూపుచున్న నిర్‌లక్ష్యభావమునకు వినోబాజీ ఆశ్రువులు రాల్చిరి. "2 సం||లలో ప్రజలెల్లరు ఖాదీదరించేటట్లు నేను చేయగలను. ఆవిధముగా చేయలేకపోయిన మీరునన్ను వురితీయవచ్చును, కాని మీరే ఖాదీని యిష్టపడక పోవుట అనునని వేరువిషయము.”, అనిదుఃఖపూరితులై వినోబాజీ