పుట:Venoba-Bhudanavudyamamu.pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

18


భూమున్నంతమాత్రమున జీవితము గడపుట సులభముకాజాలదు. తన గ్రామములో లభ్యమగు ముడి పదార్దములనుండి వస్తువులనుత్పత్తి చేసిననాడే రైతు జీవితము, గ్రామప్రజల జీవితము సుఖవంతముకాగలవు. గ్రామములు సిరి, సంపదలతో నిత్య ఆనంద సౌఖ్యములతో తులతూగగలవు.

వినోబాజీ తెలంగాణాయాత్ర 6 జూన్, 1951 సం||తో పూర్తి ఆయ్యెను. ఈచారిత్రాత్మకమైన యాత్ర 51 దినములు జరిగెను. వినోబాజీ 151 గ్రామములను దర్శించిరి. సుమారు 200 గ్రామములు పర్యటించి, 12, 201 ఎకరముల భూదానము సంపాదించిరి. ఈభూమి పంపిణీకొరకై శ్రీకోదండ రామిరెడ్డి శ్రీమతి సంగము లక్మీబాయమ్మ శ్రీ కేశవరావు గార్లతోకూడిన ఒక కమిటీని నిర్ణయించిరి. ఈయాత్రలో వివోబాజీ 500 గ్రామతగాదాలను పరిష్కరించిరి. దాదాపు 2లక్షలమందికి వుపన్యసించిరి. ఈసమయములో వినోబాజీ దివచర్య యీవిధముగ నుండెడిది. 4 గంటలకు పూర్వమే నిద్రమేల్కొనెడివారు. కొంతసమయము అధ్యయన మొనరించి ప్రాతఃకాల ప్రార్థనానంతరము 5 గం||లకు నడక ప్రారంభించెడివారు. 12 మైళ్ళు నడిచిన తరువాత, అచ్చటనున్న గ్రామములో మకాంచేసెడివారు. స్నానము, అల్పాహారానంతరము స్వల్పముగా విశ్రాంతిగైకొనెడివారు. తదుపరి రెండుగంటలు వార్తాపత్రికలను చూచుటలోను, వుత్తరప్రత్యుత్తరములలోను గడపెడివారు. ఆతరువాత ఒకగంట నూలు వడకడివారు. 4 గం॥ లకు పరిచయములు (interviews) ప్రారంభమయ్యెడివి. 5 గం||లకు ప్రార్థన. వుపన్యాసము తదుపరి కొంతసమయము గ్రామస్థులతో సంభాషించి, 9 గం|| లకు శయనించెడివారు.

27 జూన్ 1951 తేదీన పౌనారులోని తమ ఆశ్రమాన్ని చేరిరి.

V

చిరకాలమునుంచి ప్రపంచములో భిక్షాటన అనేవృత్తివున్నది ఓకే స్థలములో స్థిరముగ నుండియో లేక దేశాటనచేయుచునో ఉదరపోషణార్థము కొందరు భిక్షాటన చేయుచుండిరి. కొందరు దీనిని నాగరికమైన ఒక వృత్తిగా పరిగణిస్తూ వుంటారు. శారీరకనిర్మాణమనకు మరికొందరు దీని నవలంబిస్తూంటారు. ఇంకాకొందరు బిక్షకులు విజ్ఞానవంతులైఅడుగకుండుట తమకు లభ్యమైన దానితో తృప్తిపడుతూ ఉంటారు. కాని ఎకరములనడిగే మానవుని ఎన్నడు ఎవరు దర్శించి వుండరు. స్వయంపోషకత్వాన్ని ప్రచా