పుట:Venoba-Bhudanavudyamamu.pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

14


నీయమైన హెచ్చుతగ్గులు, ముఖ్యముగా పేదవారు, ధనవంతులనే భేధము, భాగ్యవంతమైన హైద్రాబాదురాష్ట్రములో అధికముగ వుంటూవుండేవి. ఇదిముఖ్యముగా తెలంగాణాలో అథికముగ నుండెడిది. శతాబ్దాలనుంచి స్థిరపడియున్న ఫ్యూడలు విధానము యీవిభేదములను మరింత పెంపొందించినది. హిందూదేశములోని యితర ప్రాంతములకన్న తెలంగాణా జన సామాన్యము అతి బీదస్థితిలో నుండెను. అయినప్పటికి, వారి దారిద్ర నివారణకు యేప్రయత్నము చేయబోలేదు. కొద్దిసంవత్సరములకు పూర్వమే కమ్యూనిష్టుయువరులను యాసమస్య ఆకర్షించెను. వీరు చాలా క్రూరంగా కన్నిసమయములలో హత్యలు కూడా చేయుచు, భూస్వాములను బాధింప సాగిరి. భారతదేశ స్వాతంత్ర్యానంతరము తెలంగాణాసమస్య మరింత వుధృతమయ్యెను. రాష్ట్ర, కేంద్రమంత్రివర్గములు పోలీసుచర్యలో నిమగ్నులైవుండుటచే, యీఅవకాశమును కమ్యూనిష్టులు తమ పార్టీ ప్రచారమునకు వుపయోగించుకొనిరి. వారి భయంకర కృత్యముల ఫలితంగా ధన వంతులు పరారిఅయిరి. అధి కారులు వీరిని నిరోధించలేకపోయిరి. ఈవిపత్కాలములో కేంద), రాష్ట్రప్రభుత్వములు మేల్కొని, కమ్యునిష్టుల జాడతెలుపమని ప్రజలను వత్తిడి చేయసాగిరి. వీరికిభయపడి పేదప్రజలు కొందరు వెల్లడించసాగిరి. దీని ఫలితముగా కమ్యునిష్టులు మరొకవైపునుండి వీరిని బాధింపసాగిరి ఆవిధముగా పగటివేళ పోలీసువారిచేతను, రాత్రి సమయమున కమ్యునిష్టుల చేతను పీడింపబడుచు, పేదప్రజలు కనివినివెరుగని కష్టనష్టములకు గురికాసాగిరి. ఏమీఎరుగని అమాయక ప్రజలే దీనిలో అధికముగ హామమయిపోసాగిరి.

ఈస్థితిలో వినోబాజీ, యీపీడిత ప్రజల రక్షణకై తెలంగాణాకు బయలుదేరిరి. బయలుదేరి వినోబాజీ, "శాంతి సైనికుడుగా, శాంతిప్రచారమునకు తెలంగాణా వెల్లుచున్నాను. చిరకాలమునుండి నాకేవాంఛ వున్నప్పటికి కారణాంతములచే ఫలించలేదు. నేడు శ్రీరాముని ఆశీర్వచన మొంది. నాయాత్ర ప్రారంభించుచున్నానని అన్నారు. తెలంగాణా సమస్యను వివరించుచు కొందరు వేల ఎకరాల భూమి కలిగియుండుట, మరికొందరికీ ఒక్కఎక్కరమైన లేకపోవుటయే యీఘోరకృత్యములకు కారణమని, వినోబాజీ అన్నారు. ధనాపేక్షతో, పొగాకు, ఏరుశనగ పండిస్తూ, గ్రామవృత్తులు క్షీణించుటయే తెలంగాణా సమస్యకు కారణమని