పుట:Venoba-Bhudanavudyamamu.pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

15


వినోబాజీ తెల్ఫిరి. సూర్యాపేటలో మాట్లాడుచు, వినోబాజీ, "కమ్యునిష్టుల సృష్టికి ధనవంతులే కారకులు. వాస్తవమునకు ధనవంతులే కమ్యునిష్టుల తండ్రులు," అనిఅన్నారు. ఈసమస్యా పరిష్కారమునకు దీనిమూలములను భేదించవలయును. ఆదిప్రభుత్వ చర్యలవలన కొనసాగింప బడజాలదు. కమ్యునిష్టుచర్యలను నిర్మూలించవలన్న శాంతిమార్గములో భూసమస్యను పరిష్కరించవలెనని వినోబాజీ విశదపరచిరి. ఈశాంతిమార్గము వినోబాజీకి స్ఫురించిన విధానము వుత్రుష్టమైనది.

15వ తేదీ బయలుదేరి వినోబాజీ 18వ తేదీన పోచంపల్లి గ్రామము చేరిరి. కమ్యునిష్ఠుల ముఖ్యకేంద్రమైన నలగొండ జిల్లాలో యీగ్రామము గలదు. దీనిజనాభా 3000 వుండెను. 700 గృహములుండెను. గ్రామములో సంచారముచేయుచూ, వినోబాజీ హరిజననాటలోని ఒక గృహములో ప్రవేశించిరి. అందుఒక బాలింత పసిబిడ్డను చాపపై పరుండబెట్టి, తాను నేలపై కూర్చొని వుండెను. వినోబాజీ ఆమితమైన ఆప్యాయతతో ఆపసి బిడ్డను ఒడిలోనికి తీసికొనిరి. తమ పాదములను తాకిన అమాతృ దేవిని దీవించుచూ, వారు వెలుపలకు రాగా, గ్రామస్థులందరు కూడి తమ కష్టసుఖములను వివరించ ప్రారంభించిరి. వారి విచారనీయమైన చరిత్రను ఓపికతో విని. తమను మధ్యాహ్నముకలియుటకు వినోబాజీవారిని కోరిరి. మధ్యాహ్నం 1 గంటకు హరిజనులు, కొందరు సవర్ణునులు వినోబాజీని కలిసరి. వారితో సంభాషించుచూ, తమ సమస్య యేవిధముగ పరిష్కరింప బడగలదని వారు తలంచుచున్నారని వినోబాజీ వారిని ప్రశ్నించిరి. వ్యవసాయముచేసి కొనుటకు తమకు భూమివున్న తమసమస్యలను పరిష్కరించు కొనగలమని తెల్ఫిరి. ఎంతభూమి అవసరముండునని అడుగగా, ప్రజలు కొంత ఆలోచించి, 80 ఎకరముల భూమి చాలునని తెల్ఫిరి. వినోబాజీ దీర్ఘముగా ఆలోచించి, ప్రభుత్వమే భూమి, యివ్వజాలనియెడల, భూస్వాములెవరైనా సహాయపడగలరా అని ప్రశ్నించిరి. కొద్దిసమయమంతా నిళ్ళబ్దం. వెంటనే ఒకభూస్వామి తనభూమిలో 100 ఎకరములు దానమివ్వ గలనని ప్రకటించిరి. వినోబాజీ వాని ముఖములోనికి చూచుచూ, తిరిగి చెప్పమనిరి. ఆదాత తన వాగ్దానమును తిరిగితెల్పుచూ, తనను విశ్వశించ జాలకపోయిన, వ్రాతపూర్వకముగ నివ్వగలనని తెల్పిరి. వినోబాజీ ప్రత్యేకముగ దాతతో సంభాషించి, ప్రార్థన సమావేశమునకందరు హాజరవ