పుట:Venoba-Bhudanavudyamamu.pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

12

"శివరాంపల్లి"లో జరిగిన సర్వోదయ సమ్మేళనములో, వినోబాజీ పైననే ఎల్లరు ఆశలిడి, అంధకారములోనున్న దేశానికి మార్గం చూపగలవారు వినోబాజీయే అని విశ్వశించిరి. సమ్మేళనములో వినోబాజీ పంచ ప్రవచనములు వుత్తమోత్తమమైనవి. వారి ప్రధమ వుపన్యాసము సమ్మేళనమును ప్రారంభించుచు యిచ్చిరి. వినోబాజీ తమ ప్రారంభోపన్యాసములో కార్యకర్తలవలంభించవలసిన విధానములు వివరించిరి. శరీరశ్రమ నిష్ఠ నలవరచు కొనవలెనని, ధనమునుండి విముక్తులై తమతమ సంస్థలను నిర్వహించవలెనని కోరిరి. నిర్మాణకార్యకర్తలు స్వయముగా పొలములో శ్రమచేసి, శారీరకశ్రమ నిష్టకు ఆదర్శనీయులు కావలెనని కోరుచూ, చతుర్విధములైన కార్య క్రమములను శ్రోతలముందిడిరి.

(1) శాంతి సైన్యము కార్యకర్తలు గ్రామములలోకి వెళ్లి గ్రామస్థులు తమ సమస్యలను సర్వోదయ సిద్ధాంతరీత్యా పరిష్కరించుకొనుటకు బోధించవలెను.

(2) ప్రతి యింట రాట్నము, తకిలీ ప్రవేశ పెట్టవలెను. గాంధీజీ వర్ధంతి సమయమునకు ప్రతి ఒక్కరు స్వయంగా ఒడకిన ఒక చిలుప యిచ్చేప్రయత్నము చేయవలెను.

(3) పాకీదృత్తి నిర్మూలన, కార్యకర్తలు స్వయముగా యీ పని చేయుచు, ప్రజలకు తను దొడ్డెలను పరిశుభ్రముగా నుంచుకొనుటకు శిక్షణ నివ్వవలెను.

మిగిలిన మూడు పుపన్యాసములు సాయంకాలము ప్రార్థనానంతర మిచ్చిన ప్రవచనములు.

మొదటి ప్రవచనములో వాస్తవమైన ప్రార్థనావిధానాన్ని విఫులీకరించిరి. సదాచారములవలె ప్రార్థనకూడ ఓకేసాధారణ విషయమై పోయినదని అంటూ, ప్రార్థనలో ఆహం కారమును, నిర్మూలనచేసే స్వభావముగలదని, యిది సదాచారములో లేదని తెలిపిరి. మన ప్రార్థన భక్తిమార్గము నవలంభించలేదని, తెల్పిరి. పరమేశ్వరుని సాన్నిధ్యమున తమ హృదయములు విశ్రాంతి పొందుచుండవలెననే తమ అభిప్రాయమును వెల్లడించుచూ, తమ పుపన్యాసమును ముగించిరి.

రెండవరోజు ఆహార సమస్య గురించి వుపన్యసించిరి. ఈ సమస్య పరిష్కారమునకు త్రివిధములైన నూచనలిచ్చిరి.