పుట:Venoba-Bhudanavudyamamu.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

10


పంజాబి బాషలలో చక్కటి జ్ఞానమున్నది. దక్షిణ హిందూదేశ నాల్గు భాష లైన తెలుగు, తమిళము, కన్నడము, మలియాళము, వారికి తెలియును. ఆంగ్లభాష విషయమై వేరుగ చెప్పనవసరములేదు. కాలేజీలో రెండవ భాషగా సభ్యసించిన ప్రెంచి భాష తెలియును. అన్నింటికన్న ముఖ్యమైనది వారి అత్యుత్తమ సంస్కృత సాండిత్యము. వేదములు, ఉపనిషత్తులు వారికి కరతలామలకములు. 46 సం||ల వయస్సునప్పుడు వారు ఆరేబియా భాష నభ్యసించుట. వారు నిత్య విద్యార్థుల నే విషయమును వెల్లడి చేయుచున్నది. "కురాను"ను వారు చదువు విధానము ఆశ్చర్యము గొల్పుచుండును, ఇన్ని భాషలభ్యసించుటకు కారణము, వారు సర్వజనులతో, ఆచారములతో పరిచయమొంది, విశ్వమానవ సోదరత్వమును నెలకొల్ప వాంఛించుటయే. దీనివలన తమ ప్రేమ సిద్ధాంత ప్రచారము కొనసాగింపబడుట సులభ సాధ్యముకాగలదని వారిశ్వసించిరి. "జ్ఞానాభివృద్ధికయి, రెండు, మూడు, భాషాబ్యాసములు చాలును. అందరితో ప్రేమ సంబంధమును నెలగొల్పు కొనుటచే యిన్ని భాషలను నేను ఆధ్యయనం చేసితిని," అని వినోబాజీ అంటూవుంటారు. ప్రపంచములో ప్రతి అణువుయందు పరమ్వేరుని దర్శించే దృష్టిని వినోబాజీ చరిత్ర తెల్పుచున్నది. మహదేవదేశాయి వినోబాజీ గురించి యీవిధముగ వ్రాసిరి.

"ఇతరుల వద్దలేని ప్రత్యేక గుణము వినోబావద్ద గలదు. తమ విర్ణయమును వెంటనే కార్య రూపములో నుంచుట, వారి ప్రత్యేకమైన విశిష్టగుణము. అవిచ్ఛన్న మైన అభివృద్ధి వారి రెండవ విశేషగుణము. బాపూజీలో తప్ప, యీగుణము వినోబా ఓక్కరిలోనే నాకు కనబడినది".

సద్విచారము వినోబాజీ స్థిరమైన మిత్రరత్నము. వినోబాజీ వుత్తమ అభివృద్ధికి, వారి శారీరక, ఆత్మ పరిణామములు, దోహద మిచ్చినవి. వారి ఆశ్రమంలోని "కాంచనముక్తి" ప్రయోగము భారత దేశములో వాస్తవమైన స్వరాజ్యమును గ్రామగ్రామములో వ్యాపింపజేయుటకు మానవుని కోరికల నుండి విముక్తిని చేయుటకు అత్యధికముగ తోడ్పడినది. శారీరక శ్రమ నిష్ట, ప్రేమ అను ఆయుధములతో తమకలలను వాస్తవపరచ మొదలిడిరి. వీని ఆచరణ మార్గమునకై వొనర్చిన ఆత్మసాధనల ఫలితముగనే, భూదాన వుద్యమం వారికి స్ఫురించెను.