పుట:Venkateswara Sthuthiratnamaala Veturi Prabhakarasastri.pdf/23

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

16 శ్రీవేంకటేశ్వరస్తుతిరత్నమాల



ఉ|| నాసిక పేరి మువ్వపుటనంటికిఁ బైబొమ లాకు లయ్యెను
    ల్లాసము చూపు లేఁత మొవులాగు మెయిం దిలకంబు గల్లెడుం
    ద్రాసవగంధ మింకు నని బంభరడింభకపం_క్తి చేరున
    సకలేశ ! నీదునిటలాలక జాలక మింపు గొల్బెడిన్.

చ|| అభయవితీర్ణిధుర్య ! కరుణామృతవర్షము చూపు మేఘస
    న్నిభుఁ డగు నీకు నీవివిధ నిర్మలరత్నకిరీటభూషణ
    ప్రభలు ఘటించు చున్నయని భక్తమయూరమహోత్సవంబుగా
    నభినవపాకశాసనశరాసనసృష్టి కళాకలాపముల్.

ఉ||ఉల్లము చల్ల నయ్యె మొద లూడె మనోరధముల్ జగంబుపై
   నొల్లమి పుట్టె చేరుగడ నొందితి నీళుభదివ్యవిగ్రహా
   భ్యుల్లసనావలోకనసుఖోదధి లోపల నోల లాడుచుం
   దొల్లిటివాఁడఁ గాని గతిఁ దోయరు హేక్షణ ! సంతసించెదన్.

చ|| తెలియని ధూరవర్తనులు తెంపరులై తమ యు_క్తి భంగులన్
   బలుకుట గాక నిక్కముగ భ_క్తివశుం డగు నిన్నుఁ జూడఁగాఁ
   గలుగుటకంటె నొండి"క సుఖంబును గల్గునె కల్గనిమ్కు నా
   తలఁపున కింపుగా దిదియ తప్పక కల్గ ననుగ్రహింపవే !