పుట:Venkateswara Sthuthiratnamaala Veturi Prabhakarasastri.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది



పింగళి సూరనార్యుడు

ఈతడు 18.వ శతాబ్దము వాఁడు. తండ్రి యమరన్న, తల్లియబ్బమ్ల ఇతని నివాసస్థానము కర్నూలు మండలములోని యాకు వీడు, నంద్యాల మొదలగునవిగా తోచుచున్నది. నంద్యాల పరిపాలకు డగు కృష్ణరాజు ఆస్థానములో నుండెను. గరుడపురాణము, గిరిజాకల్యాణము, రాఘవ పాండవీయము, ప్రభావతీప్రద్యుమ్నము, కళాపూర్ణోదయము లీతని కృతులు. మొదటి రెండు నామమాత్రా వశిష్టములు, ఈ స్తుతిపద్యములు కళాపూర్ణోదయములోనివి.

కళాపూర్ణోదయము

సీ|| మణిమయ ప్రాకారమండపగోపురో
           దీర్ఘకాంతులచేతఁ దేజమునకుఁ
జారునదీహస్త చామరవీజన
          వ్యాపారములచేత వాయువునకు
నారాధనార్థయాతాయాతజనవిభూ
          షారజోవృష్టిచే ధారుణికిని
హృద్యచతుర్విధవాద్యస్వనోపయో
          గ ప్రవర్తనముచే గగనమునకు

గీ|| నిజనవాగరు ధూపజనీరవాహ
జననసంబంధమహిమచే సలిలమునకుఁ
బావనత్వంబు గలుగంగ బరగు వేంక
టేశునగరు దాఁ జేరి యింపెసగ మెసఁగ.