పుట:Venkateswara Sthuthiratnamaala Veturi Prabhakarasastri.pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీవేంకటేశ్వర స్తుతి రత్నమాల 15


చ|| తన సుషచూవిశేషములఁ దప్పక శంఖములకా జయించుటం
    దనికిన కీర్తీ రేఖలవిధంబున నుజ్వలకాంతిఁ బొల్చు నీ
    యనుపమ తారహారలతికాపరికల్పిత వేల్లనంబుచే
    గనుగొన నొప్ప నీ కిప్పడు కంధరకంధరవర్ణ బంధురా !

చ|| వెడవెడ క్రొత్త క్రొత్త మొగి విచ్చిన కెందలిరాకుఁ గెంవు చూ
    పెడు జిగి గల్గు నీయధరబింబమరీచులు దొంగలింప నీ
    బెడఁగు వహించు నెమైుగము పేరిటి పున్నమ చందమామకున్
    సడలని దట్టపం బొడుపుఁ జాయ ఘటించెడు నంబుజోదరా !

చ|| తిలకితదంత కాంతు లనుతీవ మెఱుంగులు సుస్వరాఖ్యగ
    లు గల నీవచో మృతరసంబులు పైఁగురియంగ నా మదిం
    గల భవతాప మెల్ల విడి గ్రమ్మవె యంగకదంబకంబులం
    బులకనవాంకురంబు లివి పొందగు రీతి గదా ! గదాధరా !

ఉ|| ముద్దులుగుల్కు నీభువనమోహనకుండలరత్నదీధితుఁ
    ల్గద్దఱిలాగమై ధశధళందొలుపా రెడు భంగిఁ జూడఁగాఁ
    దద్దయుఁ జెన్నుమీరెడు పదప్రణతావనకేళిలోల ! నీ
    నిద్దపుచెక్కుటద్దముల నిల్వక జాఱుచుఁ బ్రాకు కైవడిన్.

ఉ|| క్రొవ్వున మచ్చరించి తుద గూడక శరణార్థిబుద్ధితో
    నివ్వటిలంగ నీమొగము నెమ్మదిఁ జొచ్చి వెలుంగు మవ్వపుం
    గ్రోవ్విరితెల్లదామరలొకో యనఁగాఁ దగి చక్రహస్త ! లే
    నవ్వుదొలంకు నీదు నయనంబులు నా మదిఁ జూఱ లాడిడిన్.