పుట:Venkateswara Sthuthiratnamaala Veturi Prabhakarasastri.pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీవేంకటేశ్వరస్తుతిరత్నమాల 13

లంఘనోన్ముఖుఁ డైన జంఘాలుఁ డొక్కరుం
డిమ్మహీవలయంబు నెంత గడుచు

గీ|| నట్టిదయ స్టో యనంతకల్యాణగుణస
    మృద్ధుఁ డగు నిన్ను ననుబోఁటి యెంత పొగడు
    నెంతమాత్రయుఁ బొగడుట కేది యెఱుక ?
    యెఱుక నేఁ డిఁకఁ గలుగునే ? యీశ్వరేశ !

చ|| తొలుదెసవేల్పమానికపుఁదోరపుఁగాంతికి మేలుబంతి క్రొ
    మ్మొలక మొయిళ్లవన్నియల మొల్ల మికిందగుపుట్టినిల్ల గుం
    పులుగొనుతోరపుంబసిమిబూమియచూపవిడంబనంబు నీ
   బలితపు మేనిచాయ కను(బండవు నా కొనరించె నచ్యుతా !

చ|| అసుజలవర్గమం జలరుహంబులు నీశ్వర ! తారు శారదో
    ల్లసనముఁ బూని యైన నవిలంఘ్యతమఃకృతమీలనంబు రా
    జనవృతి కల్మి యందలి ప్రసాదము నొందక యుండు నట్టి నీ
     యసమపదాబ్దయుగ్మ మలరారెడు మూమక మానసంబునకా.

చ|| సురనదికం పెఁ దార తొలుచూలుసుమీ యని యెల్ల వారికిన్
    జిరతరధాళధళ్యమునఁ జెప్పక చెప్పెడు భంగి బొల్చునీ
    చరణబినప్రసూననఖచంద్రమరీచులు పర్వి నామదిం
    దొరలు తమంబు వోనడిచెఁ దోయరుహోత్పల బంధులోచనా !

చ|| సిరియను ధాత్రియుకా శయకుశేశయయుగ్మములం బ్రవీణలై
    సరసత నొత్తుచోఁ బొదలి సంకులముత్పులకాంకురావళుల్
   బెరసిన యప్ప డీమెఱుగుఁబిక్కలు నిక్కము దాల్ప కుండునే
   యుదగశయాన ! పాదకమలోచితకంటకనాళ భావముకా ?