పుట:Venkateswara Sthuthiratnamaala Veturi Prabhakarasastri.pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

14 శ్రీవేంకటేశ్వరస్తుతిరత్నమాల



ఉ|| అందములైన నీతొడలయాకృతిశోభ వహింప లేని యా
    నిందకుఁ జాలమిం నిలువు నీఱగు టెంత యనంటికంబముల్
    నందిత భక్త లోకయతులం బగు నీ భవదూరుసామ్యముం
    బొందఁ దలంచు ధూర్తమతిఁ బొందెనధోగతి హస్తిహస్తముల్.

ఉ|| కన్నులపండువై ధగధగం జిగిరంగుఁ రుఱంగలింపఁగాఁ
    జెన్ను వహించు నీపసిఁడిచేల వహించిన నీలవర్ణ :నీ
    యిన్నెటిఁ జూడ మీఁదినగ మెల ఘనాఘనపం కి పర్విపై
    కొన్న మెఱుంగుబంగరువుకొండగతిం దిలకించె నెంతయున్.

ఉ|| లోకము లెన్నియన్నియును లోఁ గొనియుం దనలేమిఁ జూపు నీ
    యీకృశమధ్యభాగ మిపు డీక్షణలక్ష్యము గా దటంచు నే
    నోకమలేశ ! లే దనుట యుక్తముగా దలబ్రహ్మఁ గన్న నా
    శీకముతోడి పొక్కిలికి లేమి ఘటిల్లెడు నట్లు గావునన్.

చ|| పొలుపుగ మధ్యదేశమునఁ బూనిన కౌస్తుభ మెజ్జచాయలన్
    ధళధళితద్యుతుల్ గొలుప దైత్యవిమర్దన ! నీయురంబు ని
    ర్మలరుచి గూడఁ బొల్చె నడుమం బ్రతిబింబితబాలభానుమం
    డలము వెలుంగఁ బొల్చు యమునానది గన్న ప్రదంబు కైవడికా.

చ|| దళితము హే ద్రనీలరుచిదాయకవిగ్రహ ! నీగభీరతా
    జలనిధిభావముం దెలుపఁ జాలిన లక్షణలక్షితంబులై ـ
    యలవడెఁ గంకణాంకితములై సముదంచితశంఖచక్రసం
    కలితములై యభంగపరిఘాసమతుంగభుజాతరంగముల్.