పుట:Venkata Ramareddy Jeevita Charitra Pratapa Reddy 1891.pdf/49

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

28


దుప్పటి కప్పినారు. తిన్నగా బయటికి జారుకున్నారు. అర్ధ రాత్రివేళ రఘునాథ రెడ్డి గారు యువకులు పడుకున్న గది చూచి నారు. వారేయని భ్రమించి తృప్తి పడినారు. ఇచ్చట రెడ్డిగారుసు మిత్రులును వేడుకలు చూచి తిరిగివచ్చుచు ఉస్మాన్ గంజి పోలీసు ఠానావద్ద యేదో అల్లరి జరుగుచుండగా చూచుటకై నిలిచినారు. ఠానా పోలీసు వారు అందరితో పాటు వీరిని గూడ పట్టుకొన్నారు. "మాకేమియు ఈ తగవులతో సంబంధము లేదు” అని యెంత చెప్పినను పోలీసు వారు వినక ఠానాలో వేసి యుంచినారు. తెల్లవారు జామున ఆ నాకా యెదుట నుండునట్టి అబ్దుల్లా రిసాలా మిలిటిరీ అధికారి వీని చూచినారు. విషయమంతయు విచారించినారు. అదృష్టవశమున రఘునాథ రెడ్డి గారి కామిలిటరీ అధికారి పరిచితుడు. అందుచేత తన జవాను లను చీవాట్లు పెట్టి ఈ యువకుల ఇంటికి పంపి వేసినారు. వేంకట రామారెడ్డిగారా నాటి యాసన్నివేశము నిప్పటికి మరచిపోలేదు. తాను కొత్యాలుపదవి నందిన తర్వాత ఉస్మానుగంజి నాకా మీదుగా వెళ్లినప్పుడంతయు తన చిన్ననాటి కథ జ్ఞాపకము వచ్చుచుండునని చెప్పెడివారు.


ఇట్లు కొంత కాలము గడిచినత ర్వాత వేంకట రామా రెడ్డి గారికి ఉద్యోగ నియామక మయ్యెను. 26 పర్వర్ది 1296 ఫసలీనాడు వారు అమీను పదవిలో నియుక్తులైరి. మొదట - -