పుట:Venkata Ramareddy Jeevita Charitra Pratapa Reddy 1891.pdf/48

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

27


అధికారియు వీటికి చాల సహాయము చేసిరి. ఆజ్ఞలు లభించుటకు కొంత కాలము పట్టునని చెప్పిరి. సరేయని నజర్ మహమ్మద్ ఖాను వేంకటరామా రెడ్డిగారిని సగరములోనే వదలి తనయుద్యోగముపై రాయచూరునకు వెళ్ళిపోయెను.

హైదాబాదు నగరములో రెడ్డిగారు జాంబాగు సమీపములో నుండునట్టి జార్జి రఘునాథ రెడ్డి గారి బంగ్లాలో నివాసము చేయుచుండిరి. ఈ రఘునాథ రెడ్డిగారు 'రెడ్డిగారి బంధు వులు. వారు నగరములో మంచిపలుకుబడి కలవారు. గొప్ప విద్యావంతులు (థియాసఫీ) దివ్యజ్ఞాన సంఘములో చేరినట్టివారు. సిద్దిరీసాలలో చాలకాలము కమాండింగ్ అధికారిగా నుండిరి. చాల సౌమ్య స్వభావము కలవాడు. రెడ్డి గారికి ప్రతిదినమును ఉద్యోగము యొక్క పైరవీలో కాలము గడుచు చుండెను.

ఆ కాలములోని ఒక చిన్న వినోద విషయము రెడ్డి గారి జీవితములో పేర్కొనదగిన దైయున్నది. వీరు నగరములో నుండు కాలములోనే మొహరం వచ్చినది. రాత్రి వేడుకలు చూచుటకై తానును మరిముగ్గురు స్నేహితులును బయలు దేరినారు. కాని ఈ సంగతి రఘునాథ రెడ్డికి తెలుపకయే వెళ్లవలెనని వారి సంకల్పము. అందుకై వారొక యుక్తి పన్నినారు. తమతమ పడకలమీద దిండ్లను నిలువుగా పెట్టినారు. వాటి పై