పుట:Venkata Ramareddy Jeevita Charitra Pratapa Reddy 1891.pdf/47

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

26


మియ్య రేమో అనిపించెను. పఠాను దానికి తగిన యుక్తిపన్ని నాడు. దూదితో కట్టిన బొంత అంగీలు తొడిగించినాడు. ఎత్తైన బూట్లు (అందులోను అడుగున యెత్తు పెట్టించి, తొడిగించినాడు. ఈ వేషముతో తన వెంట అధికారుల వద్దకు తీసుకొని పోవుచు వచ్చినాడు. అట్లుండినను సుబేదారు రెడ్డిగారిని చూచి "ఇంకనుచిన్న వాడు ఇప్పుడేమి తొందర మరి ఒకటి రెండేండ్లు చదువుకొననిమ్మ. నెలకు 10 రూపాయలు సర్కారునుండి యిప్పింతును, ". అని సెలవిచ్చెను. పఠాను కదంతయు తృప్తిని కలిగించ లేదు. ఇప్పుడే నౌకరీ యిప్పించుమని పట్టుబట్టెను. తుదకు సూబేదారను కూలుడయ్యెను. జిల్లా పోలీసు నాజిం (డైరక్టరు) అగు లగ్లోయను ఇంగ్లీషు అధికారి వద్దకు తర్వాత పోవలసి వచ్చెను. లడ్లోగారు యువకుని చూచి మందముగా కనబడులకై వేసి కొనిన దుస్తులను చూచియు తృప్తి చెందక మనిషిని పట్టిచూచినాడు. అంతయు మెత్త మెత్తగా చేతికి తగిలెను. “ఇ దేమిటి” అని విచారించగా " చలి పెట్టుటచేత మెత్తని బట్టల తొడిగినాను. " అని రెడ్డి గారు జవాబు చెప్పవలసి వచ్చెను. పఠాను పట్టుదల గలవాడు. అతని ప్రయత్నముల ఫలితముగా రెడ్డి గారిని అమీను పదవి పై ఉద్యోగిగా నేర్పాటు చేయుటకు లడ్లో గారును సుబేదారుగారును అంగీకరించిరి. మరియు హసన్ బిన్ అబ్దుల్లా (ఉరఫ్) ఇమాద్నవాజుజంగు అను అకౌంటెంటు జనరల్