పుట:Venkata Ramareddy Jeevita Charitra Pratapa Reddy 1891.pdf/50

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

29


నాల్గవ దర్జాపోలీసు అమీన్ గా నెలకు 20 రూపాయీల జీత ముపై ఏర్పాటు చేయబడిరి. గుర్రము వ్యయమునకని నెలకు 20 రూపాయలు అనుమతించిరి. ఉద్యోగములో అనుభవము లేని వారని అధికారు లెరిగిన వారగుటచేత లింగుసూగూరు జిల్లా పోలీసు అధికారి ఆధీనములో ముద్గల్ ఠానా అమీనుగా 'నియుక్తులైరి. ఇంతేకాదు, వీరి చేతి క్రింద పనిచేయునట్టి మొహ రిర్ గారే ముద్గల్ నాకా వ్యవహారము లన్నింటికిని జిమ్మే దారులుగా నిర్ణయింపబడిరి.

వేంకటరామా రెడ్డిగారు తమ ప్రథమోద్యోగమును నిర్వహించుటక లింగుసూగూరు జిల్లాలో చేరినట్టి ముదగల్లు ఠానాకు వెళ్ళిరి. పోలీసు ఉద్యోగములో కాని మరే ఉద్యోగములో కాని చేయునట్టి విధులును కార్యములును యేమియు తెలియని వారు. అయితే ఒక అనుకూలముండెను. అన్నిటికిని తానుగాక తన చేతి క్రింది మొహరిరే ఉత్తరవాదిగా నిర్ణయిం పబడియుండెను. మొదటి కొన్ని మాసములందు మొహరిర్ అంతయు నిర్వహించుకొని తెచ్చిన సర్కారీ కాగితములపై ఎచ్చట సంతకము పెట్టుమసిన అచ్చట వీరు సంతకము చేయు చుండిరి.

ఇట్లుండ ముదగల్లు తహసీల్దారుగా “మౌల్వీ షాబా ఖీసాబ్", అసువారు తహసీల్దారుగా వచ్చిరి. వారు స్వర్గీయు లైన